నకిలీ విద్యార్ధి వీసాలు, అడ్మిషన్ లెటర్స్ కుంభకోణానికి గాను భారత్‌లోని పంజాబ్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రాను( Brijesh Mishra ) కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇతను తనపై మోపిన అభియోగాలను ఖండించాడు.
బుధవారం విచారణకు హాజరైన బ్రిజేష్ మిశ్రా.వారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనను నిందిస్తున్నారని వ్యాఖ్యానించినట్లు టొరంటో స్థార్ నివేదించింది.
బాధిత విద్యార్ధుల్లో ఒకరైన కరమ్‌జిత్ కౌర్‌కు సంబంధించిన కేసులో వీడియో లింక్ ద్వారా మిశ్రా.టొరంటోలోని ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్( Immigration Tribunal ) ముందు విచారణకు హాజరయ్యాడు.
తాను ఆగస్ట్ 2019 వరకు ఆస్ట్రేలియాలోని ఉన్నత విద్యాసంస్థల కోసం విద్యార్ధులను రిక్రూట్ చేయడంలో మాత్రమే పాల్గొన్నట్లు మిశ్రా పేర్కొన్నాడు.
కాగా.
ఈ ఏడాది ప్రారంభంలో నకిలీ వీసాలు,( Fake Visa ) ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా( Canada ) ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.
భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.
వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.
ఇమ్మిగ్రేషన్ స్కామ్‌లో పంజాబ్‌కు( Punjab ) చెందిన విద్యార్ధులే ఎక్కువ.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో( Fake Offer Letters ) అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.
అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.విద్యార్ధులను తప్పుదోవ పట్టించిన వారు, మోసం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.
బాధిత విద్యార్ధులలో ఎక్కువమంది జలంధర్ నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సెలింగ్ సంస్థ ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ ఆస్ట్రేలియా (ఈఎంఎస్ఏ) ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా ద్వారా కెనడాలో అడుగుపెట్టినట్లు తేలింది.ఈ కేసుకు సంబంధించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) . బ్రిజేషపై ఐదు అభియోగాలు మోపింది.ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) , సీబీఎస్ఏకి చెందిన అధికారుల టాస్క్‌ఫోర్స్ ప్రస్తుతం విద్యార్ధులపై కేసులను పరిశీలిస్తుండగా, బహిష్కరణను ప్రస్తుతం నిలిపివేసింది.