తెలంగాణ ఎన్నికల్లో హోరా హోరి గా పోరాడుతున్న కాంగ్రెస్( Congress ) విజయానికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకుంటుంది.ఇప్పటికే 90 శాతానికి పైగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసుకున్న కాంగ్రెస్, ఇప్పుడు పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి పెట్టింది.
దీనికోసం జాతీయస్థాయి నేతలను రంగంలోకి దించుతుంది.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి అంతా తానే అయ్యి వ్యవహరించిన డీకే శివకుమార్ ను( DK Sivakumar ) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్టార్ కాంపైనర్ గా వాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఆయనతో తాండూరులో విజయ భేరి పేరుతో సభ నిర్వహించింది.
అయితే ఆ సభలో డీకే చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని తెలుస్తుంది.
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేసీఆర్( KCR ) అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు కట్టడం తో తెలంగాణ రైతాంగంలో బారాస కు మంచి పట్టు ఉంది.
దాంతో ఆయా వర్గాల ఆదరణ పొందడానికి కాంగ్రెస్ కూడా కొన్ని హామీలను ఇస్తుంది.అందులో భాగంగానే తాము అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి 24 గంటల కరెంటు ఇస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) హామీ ఇచ్చింది.
అయితే కర్ణాటకలో మాత్రం తాము ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నామంటూ డీకే ప్రకటించడం సంచలనంగా మారింది.
తీవ్ర సంక్షోభంలోనూ ఐదు గంటలు కరెంటు ఇస్తున్నామని దీనికి 7 గంటలకు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని, కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నామని అబద్ధపు హామీలు ఇస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే కర్ణాటక పరిపాలన చూపించి తెలంగాణలో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ ఐదు గంటలే కరెంటు ఇస్తున్నామని డీకే చేసిన వ్యాఖ్యలు తమకు నష్టం కలిగిస్తాయ నే ఆందోళనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఈ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకున్న బారాస( BRS ) తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను విపరీతంగా ప్రచారం చేస్తుంది.కాంగ్రెస్ వారివి అబద్ధపు హామీలని, కాంగ్రెస్కు అధికారం లోకి ఇస్తే మూడు గంటలే కరెంటు ఇస్తుందని ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్న బారాస వ్యాఖ్యలకు ఇప్పుడు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయి.మరి బలం పెంచుతారని పిలిపించిన డీకే తెలంగాణ కాంగ్రెస్ గాలి తీసేసినట్టుగా వ్యాఖ్యానించడం పట్ల పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది.