నందమూరి బాలకృష్ణ ( Balakrishna )ను మరో యాంగిల్ లో చూపించిన షో ఆహా అన్ స్టాపబుల్ అనడంలో సందేహం లేదు.బాలకృష్ణ ను ఇలా కూడా చూస్తామా అని ఆయన అభిమానులు కూడా అనుకుని ఉండరు.
అలాంటి షో తో బాలయ్య ఓ రేంజ్ లో కుమ్మేశాడు.భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్న అన్ స్టాపబుల్ షో( unstoppable show ) తో బాలయ్య భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.
బాలయ్య ఇప్పటి వరకు రెండు సీజన్ ల అన్ స్టాపబుల్ షో ను ముగించడం జరిగింది.ఇటీవలే మూడో సీజన్ అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆహా లో ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు.భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) టీం మెంబర్స్ తో ఆ ఎపిసోడ్ ను షూట్ చేశారు.
తదుపరి ఎపిసోడ్ లో గెస్ట్ లు ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆహా టీం వారు ఇప్పట్లో కొత్త ఎపిసోడ్స్ ఏమీ ఉండవు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మాత్రమే అన్ స్టాపబుల్ షో మూడో సీజన్ ను మళ్లీ షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఒక వేళ రాజకీయంగా ఇబ్బందులు ఉంటే వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.అదే నిజం అయితే కచ్చితంగా బాలయ్య అభిమానులకు ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య మరియు ఆహా కాంబో టాక్ షో కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో భగవంత్ కేసరి టీమ్ ( Bhagavanth Kesari ) తో వచ్చి ఇప్పుడు ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.కేవలం భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ కోసమే అన్నట్లుగా సీజన్ 3 ని మొదలు పెట్టారా అనేది కొందరి అభిప్రాయం.
మొదటి నుంచి కూడా భగవంత్ కేసరి మూడో సీజన్ షార్ట్ అండ్ క్రిస్పీ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.కనుక ఒకే ఎపిసోడ్ తో ముగిస్తారేమో చూడాలి.