వంగవీటి రాధా పెళ్లిలో కొడాలి నానిని తొక్కి పారేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..వైరల్ అవుతున్న వీడియో!

పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ మీద విమర్శలు చేసినప్పుడల్లా వైసీపీ నాయకులూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి నోటికి వాచినట్టు తిట్టడం మనం చూస్తూనే ఉన్నాం.ఒక్కోసారి అభిమానులకు అనిపిస్తాది, సినిమా ఇండస్ట్రీ లో మహారాజు లాంటి స్థానం ని వదిలి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇలాంటి వాళ్ళ చేత తిట్టించుకోవడం అవసరమా అని.

 Kodali Nani Nearly Collapses After Pawan Kalyan Entry At Vangaveeti Radha Weddin-TeluguStop.com

కానీ రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి.పదవులు లేకపోతే వీళ్లంతా పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగడానికి క్యూ లైన్ లో నిల్చోవాల్సిన వాళ్ళే.

అందులో ఎలాంటి సందేహం లేదు.ఇదంతా పక్కన పెడితే వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు, వంగవీటి రాధ( Vangaveeti Radha ) నిన్న పుష్పవల్లి( Pushpavalli ) అనే అమ్మాయిని విజయవాడ లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.

ఈ వివాహ మహోత్సవానికి వంగవీటి రాధ కి ఎంతో దగ్గరైన వాళ్ళు, అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులూ హాజరయ్యారు.

వారిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ హాజరై వధూవరులను ఆస్వీర్వదించారు.అలాగే వైసీపీ పార్టీ నుండి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు కూడా హాజరయ్యారు.అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సమయానికే కొడాలి నాని( Kodali Nani ) మరియు వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) వచ్చారు.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే పెళ్లి మండపం మొత్తం పవర్ స్టార్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిపోయింది.ఆయన ఉన్నంతసేపు వైబ్రేషన్స్ తో పెళ్లి మండపం ఊగిపోయింది.పెళ్లి మండపం ఎక్కినప్పుడు పవన్ పక్కనే కొడాలి నాని కూడా ఉన్నారు.కానీ పవన్ అభిమానుల తాకిడికి కొడాలి నాని వెనక్కి వెళ్ళిపోయాడు.

కాస్త కంట్రోల్ తప్పి ఉంటే క్రింద పడిపోయే వాడు కూడా.కానీ తృటిలో ఆ ప్రమాదం తప్పింది.

మరోపక్క కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీ కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.మైక్ దొరికితే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉండే వైసీపీ నాయకులూ( YCP ) పవన్ కళ్యాణ్ ఎదురు పడితే వాళ్ళ పరిస్థితి ఇది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు వేస్తున్నారు.ఇకపోతే వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ అంతకు ముందు ఆయన జనసేన పార్టీ లోకి( Janasena ) చేరబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.కానీ ఇప్పుడు రెండు పార్టీలు కలిసే పోటీ చెయ్యబోతున్నాయి కాబట్టి వంగవీటి టీడీపీ నుండి పోటీ చేస్తాడా?, లేదా జనసేన నుండి పోటీ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube