టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ క్రమంలో దానివలన మనిషి అనేక సౌకర్యాలను పొందుతున్నాడు.
మరీ ముఖ్యంగా విలువైన కాలాన్ని పొదుపుచేయగలుగుతున్నాడు.ఈ రోజు ఉన్న మెథడ్స్ రేపు ఉండటం లేదు.
ఎప్పటికప్పుడు అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన సాఫ్ట్ వేర్లు జనాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇక స్మార్ట్ ఫోన్లలో వాడే సిమ్ కార్డులు( Sim Cards ) గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.
అమెరికా లాంటి దేశాల్లో ఈ-సిమ్ లు ( E-Sim Card ) వినియోగంలో ఉన్నాయన్న సంగతి మీకుతెలుసా? మన దేశంలో అవి ఇంకా పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు.అయినప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు?
ఇప్పుడు ఈ ఈ-సిమ్ స్థానాన్ని ఐ-సిమ్( I-Sim ) భర్తీ చేసేందుకు సిద్ధమైంది.అవును, త్వరలోనే ఐ-సిమ్ అందుబాటులోకి రానున్నట్లు టెక్ సర్కిళ్లలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఈసిమ్ కంటే ఐసిమ్ అడ్వాన్స్ డ్ వెర్షన్ అని అనుకోవచ్చు.
దాని కంటే ఐసిమ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది కూడా.భవిష్యత్తులో వచ్చే స్నాప్‌డ్రాగన్ చిప్‌లతో( Snapdragon ) కూడిన స్మార్ట్ఫోన్లకు ఈ ఐసిమ్ లను తీసుకొస్తున్నట్లు క్వాల్కామ్ సంస్థ ఆమధ్య ఓ ప్రకటన చేసింది.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఈ ఐసిమ్ కు ససోర్టు చేస్తుంది.భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ వినియోగదారులు ఈ ఐసిమ్ లనే వినియోగిస్తారని క్వాల్కామ్( Qualcomm ) కచ్చితంగా చెబుతోంది.
ఈ-సిమ్ ని యాక్టివేట్ లేదా ఎనేబుల్ చేసే ప్రక్రియ చాలా తేలిక.ఐతే ఇక్కడ అన్ని ఆపరేటర్లకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు.ప్రాసెస్ అనేది మారుతుంటుంది.ప్రస్తుతం మన దేశంలో కొన్ని ప్రీమియం ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.యాపిల్ కంపెనీ నుంచి ఐఓఎస్ వెర్షన్ 12.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది.అదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా తక్కువ కంపెనీలకు చెందిన ఫోన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంది.గూగుల్, మోటోరోలా, నోకియా, శామ్ సంగ్, వివో ఫోన్లు అవి కూడా లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయ్యి ఉన్న ఫోన్లకు మద్దతిస్తుంది.
ఐతే ఈ సిమ్ లెస్ స్మార్ట్ ఫోన్స్ అనేవి మనదగ్గర మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది ఇంకా తెలియాల్సి వుంది.