నటుడు సంపూర్ణేష్ బాబు ( Sampoornesh Babu ) ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ ( Martin Luther King ).తమిళంలో ఘన విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి ఇది రీమేక్.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన అరెస్టు గురించి ఈయనకు ప్రశ్న ఎదురు కావడంతో ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం తెలియజేశారు.
ఈ సందర్భంగా నరేష్( Naresh ) ను ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu Arrest ) అరెస్టు విషయంలో మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు .ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నేను ప్రత్యేకంగా ఫలానా నాయకుడు గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది.వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా సరే బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచించింది.ఆ తిరుగుబాటు ఫలితం తప్పక వస్తుంది.ఎమర్జెన్సీ సమయంలో చాలామంది నాయకులను జైల్లో పెట్టారు ఆ తర్వాత ఏమైంది ఎమర్జెన్సీ అనేది ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయిందని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు.
రాజకీయ నాయకుడు( Political Leader ) అన్న తర్వాత ప్రజలకు సేవ చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది కానీ ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది అంటే డబ్బు అనే చిక్కు ముడి పడి ఉందని, ఆ చిక్కుముడులను విప్పాలి.సినిమా పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్( Pawan Kalyan ) రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోరాటం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను అంటూ ఈయన తెలియజేశారు.ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి సినీ ఇండస్ట్రీ కూడా మౌనం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ విషయం గురించి ఈయనని ప్రశ్నించగా.సినీ పరిశ్రమ( Film Industry ) ఎప్పుడూ వినోదాన్ని అందించడమే కాకుండా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మేమున్నామంటూ సాయం చేస్తుంది.మేము కేవలం వినోదాన్ని పంచేవాళ్లు మాత్రమే దీనికి ప్రజలే సమాధానం చెబుతారు.
ప్రస్తుతం వాతావరణం నిశ్శబ్దంగా ఉంది అంటే తుఫాను వస్తుందని హెచ్చరిక అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.