చంద్రబాబు అరెస్టుపై నరేష్ కు ప్రశ్న… షాకింగ్ సమాధానం చెప్పిన నరేష్!

నటుడు సంపూర్ణేష్‌ బాబు ( Sampoornesh Babu ) ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్‌ చిత్రం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ( Martin Luther King ).

తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి ఇది రీమేక్‌.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు నరేశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన అరెస్టు గురించి ఈయనకు ప్రశ్న ఎదురు కావడంతో ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం తెలియజేశారు.

"""/" / ఈ సందర్భంగా నరేష్( Naresh ) ను ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu Arrest ) అరెస్టు విషయంలో మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు .

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నేను ప్రత్యేకంగా ఫలానా నాయకుడు గురించి  మాట్లాడాలని అనుకోవడం లేదు.

ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది.వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా సరే బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచించింది.

ఆ తిరుగుబాటు ఫలితం తప్పక వస్తుంది.ఎమర్జెన్సీ సమయంలో చాలామంది నాయకులను జైల్లో పెట్టారు ఆ తర్వాత ఏమైంది ఎమర్జెన్సీ అనేది ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయిందని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు.

"""/" / రాజకీయ నాయకుడు( Political Leader ) అన్న తర్వాత ప్రజలకు సేవ చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది కానీ ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది అంటే డబ్బు అనే చిక్కు ముడి పడి ఉందని, ఆ చిక్కుముడులను విప్పాలి.

సినిమా పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌( Pawan Kalyan ) రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోరాటం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను అంటూ ఈయన తెలియజేశారు.

ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి సినీ ఇండస్ట్రీ కూడా మౌనం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ విషయం గురించి ఈయనని ప్రశ్నించగా.సినీ పరిశ్రమ( Film Industry ) ఎప్పుడూ వినోదాన్ని అందించడమే కాకుండా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మేమున్నామంటూ సాయం చేస్తుంది.

మేము కేవలం వినోదాన్ని పంచేవాళ్లు మాత్రమే దీనికి ప్రజలే సమాధానం చెబుతారు.ప్రస్తుతం వాతావరణం నిశ్శబ్దంగా ఉంది అంటే తుఫాను వస్తుందని హెచ్చరిక అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దేవర థర్డ్ సింగిల్ క్రేజీ అప్ డేట్ ఇదే.. ఆరోజే థర్డ్ సింగిల్ తో మోత మ్రోగనుందా?