తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో ఒక్కో క్యారక్టర్ కోసం కొన్ని వందల మంది నటీనటులు పోటీ పడుతూ ఉంటారు.అందులో ఎవరో ఒకరికే ఆ అవకాశం వరిస్తుంది.
కానీ అన్ని సినిమాల్లో కూడా ఒక చిన్న పాత్ర పెద్ద ప్రభావం చూపించే విధంగా ఉంటుంది.ఆ పాత్ర సినిమా మొత్తం ఉండకపోయినా లేదంటే ఒక్క డైలాగ్ తో ముగిసి పోయేది అయిన కూడా ఆ చిన్న డైలాగ్ అయిన కూడా సినిమాను మలుపు తిప్పుతుంది.
ఆ పాత్ర కూడా అందరికీ గుర్తుంది పోతుంది.అలాంటి చిన్న చిన్న పాత్రలలో నటించడానికి చాలా మంది ఉన్న కూడా ఈ మధ్య ఆ చిన్న పాత్ర ల విషయంలో అందరి కన్నా ముందు ఉంది అనసూయ.

యాంకర్ గా బుల్లి తెరను కొన్నాళ్ల పాటు ఏలిన అనసూయ( Anchor Anasuya ) ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది.ఇక యాంకరింగ్ వద్దు కేవలం సినిమాలో మాత్రమే చేస్తానని ఆ ఇండస్ట్రీని వదిలివేసింది.మెల్లిగా డాన్సర్ గా తెలుగు సినిమా పరిశ్రమకు అడుగు పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో మంచి ప్రభావితం చేసే సినిమాలు చేస్తూ ఇప్పుడు ఫుల్ లెన్త్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప లో దాక్షాయణి గా( Dakshayani ) ఆమె నటన అద్భుతం అని చెప్పాల్సిందే.అనసూయ ఎంచుకుంటున్న పాత్రల తీరు కూడా ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకోవాలి.
ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రతి పాత్రలో వైవిధ్య ఉండే విధంగా అనసూయ తన సినిమాలను ఎంచుకుంటూ వెళ్తోంది.

ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్( Pushpa Sequel ) తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న అనసూయ ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు ప్రేమ విమానం అనే మరో జీ సిరీస్ లో కూడా నటిస్తోంది.ఇక తమిళ్ లో ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాలో ఈ ఏడాది నటిస్తుండగా మలయాళం లో కూడా ఆ మధ్య ఒక సినిమా చేసింది.ఇక ఇప్పుడు అందరూ ప్రేమ విమానం( Prema Vimanam )లో ఇద్దరు పిల్లల తల్లిగా అనసూయ ఎంతో అద్భుతంగా నటించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మరి ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్ అవుతుందో మరికొన్ని రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది.