సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram gopal Varma ) తాజాగా వ్యూహం ( Vyuham ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారనే విషయం మనకు తెలిసిందే.వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదని అన్ని నిజాలు మాత్రమే ఉన్నాయని తెలియజేశారు.వ్యూహం సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) మరణించిన తర్వాత ఇప్పటివరకు జగన్ జీవితంలో ఏర్పడినటువంటి పరిణామాలు నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలియజేశారు.ఈ సినిమా విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై నాకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని వర్మ వెల్లడించారు.

నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అభిప్రాయం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అన్న కూడా ఒక అభిప్రాయం ఉందని తెలిపారు.ఈ సినిమాలో కేవలం నిజాలు మాత్రమే ఉంటాయని తెలిపారు నేను వేరే వాళ్ళ మీద సినిమాలు చేయమంటే చేయను.వ్యూహం సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా చేయటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని, నాకు జగన్ గారి పై ఉన్న అభిమానంతోనే ఈ సినిమా చేస్తున్నానని వర్మ వెల్లడించారు.ఈ సినిమా విషయంలో ప్యాకేజీ అనేదానికి కూడా అర్హత లేదని నాకు టిడిపి వాళ్ళు లేదా వైఎస్ఆర్సిపి ఇతర పార్టీల గురించి నాకు తెలియదు ఇక్కడ నేను నమ్మిన నిజం మాత్రమే చూపిస్తున్నాను ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది అంటూ వర్మ వ్యూహం సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.