దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున హీరోలు దసరా బరిలో తమ సినిమాల ద్వారా పోటీకి దిగుతున్నారు.ఈ క్రమంలోని దసరా పండుగను పురస్కరించుకొని ఈసారి మూడు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమాల విషయంలో ఆత్రుత చూపిస్తున్నారు.
అక్టోబర్ 19వ తేదీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా( Leo Movie ) పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు తమిళ భాషలలో ఈ సినిమాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీ థియేటర్లను కేటాయించారు.
ఇక అదే రోజున బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇలా అక్టోబర్ 19వ తేదీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా 20వ తేదీ రవితేజ ( Raviteja ) నటించిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswararao ) సినిమా విడుదల కానుంది దీంతో ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడిందని చెప్పాలి .ఇక లియో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడులో రవితేజ సినిమాకు కేవలం 30 లోపు థియేటర్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తుంది.ఆ థియేటర్లు కూడా పెద్దగా పేరు ఉన్న థియేటర్లో కాకపోవడం గమనార్హం.
ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో భగవంత్ కేసరి సినిమాకు కేటాయించిన థియేటర్లను ఏమాత్రం తగ్గించేది లేదు అని నాగ వంశీ తెలిపారు.
ఈ విధంగా తెలుగులో బాలయ్య సినిమాకు కావలసినన్ని థియేటర్లు ఉన్నాయి అలాగే తమిళ హీరో విజయ్ సినిమాని ఇక్కడ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయన సినిమాకు కూడా అధిక మొత్తంలో థియేటర్లు కేటాయించారు కానీ రవితేజకు మాత్రం చాలా తక్కువ థియేటర్లో కేటాయించడంతో రవితేజ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రవితేజ సినిమాకు తమిళనాడులో 30 థియేటర్లు కూడా ఇవ్వని పక్షంలో తమిళ హీరోకి మాత్రం తెలుగులో అధిక థియేటర్లు కేటాయించారని ఇలా టాలీవుడ్ హీరో సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా తెలుగు చిత్ర పరిశ్రమనే తనని తొక్కేస్తున్నారు అంటూ రవితేజ అభిమానులు ఫైర్ అవుతున్నారు.