హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక( Sri Lanka )ను చిత్తుగా ఓడించి పాకిస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటర్లైన కుషాల్ మెండీస్( Kusal Mendis ) 77 బంతులలో 14 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేశాడు.సమర విక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.
కుషాల్ మెండీస్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించి 65 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.ప్రపంచ కప్ లో శ్రీలంక తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా కుషాల్ మిండిస్ నిలిచాడు.గతంలో ఈ రికార్డ్ కుమార సంగక్కర పేరిట ఉండేది.2015 ప్రపంచ కప్ లో 70 బంతుల్లో సంగక్కర సెంచరీ సాధించాడు కానీ కుషాల్ మెండీస్ 65 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించాడు.
అయితే కుషాల్ మెండీస్ వెన్ను, కాళ్ల నొప్పులు, తిమ్మిర్లతో బాధపడుతున్నాడు.అందుకే పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో కుషాల్ మెండీస్ మైదానంలోకి దిగలేదు.ఇతని స్థానంలో దుషన్ హేమంత మైదానంలోకి వచ్చాడు.కుషాల్ మెండీస్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
కుషాల్ మెండీస్ తో పాటు ఇతర శ్రీలంక బ్యాటర్లు రాణిస్తున్న.బౌలర్లు మాత్రం సాధారణ ప్రదర్శన చేస్తున్నడంతో శ్రీలంక ఇప్పటివరకు వాడిన రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది.
ఇక పాకిస్తాన్( Pakistan ) విషయానికి వస్తే.48.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.పాకిస్తాన్ బ్యాటర్లైన మహమ్మద్ 121, అబ్దుల్లా షఫీక్ 113 పరుగులతో చెలరేగారు.
పాకిస్తాన్ జట్టు విజయం సాధించడానికి శ్రీలంక బౌలర్లు కీలక పాత్ర పోషించారు.పాక్ బ్యాటర్లను కట్టడి చేయడంలో శ్రీలంక బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.