నాన్ స్టాప్ ప్రచారానికి తెర తీసిన వైసీపీ!

తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్( Telangana Elections Notification ) అవ్వడంతో ఆ హడావుడి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది.అధికార వైసిపి సామాజిక న్యాయ యాత్ర పేరుతో ఒక బస్సు యాత్రను ప్లాన్ చేసింది.

 Ycp Has Opened The Curtain For Non-stop Campaign!,ycp,ys Jagan,ap Politics,ap E-TeluguStop.com

విజయదశమి పండుగ( Dasara Festival ) ముగిసిన తర్వాత ఈ యాత్ర మొదలవనున్నట్లుగా తెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేటట్టుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా వైసిపి ఈ బస్సు యాత్రను ప్లాన్ చేస్తుంది.వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైసిపి ఈ బస్సు యాత్రను ప్లాన్ చేసింది .ఇప్పటికే ఈ బస్సు యాత్ర విధివిధానాలపై జిల్లా రీజనల్ కోఆర్డినేటర్లతో వర్క్ షాప్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ ఈ యాత్ర రెండు నెలలపాటు నిరంతరాయంగా కొనసాగాలని సచివాలయ కన్వీనర్లు, వార్డు వాలంటీర్లు, సర్పంచులు,వార్డు మెంబర్లు, గ్రామ కమిటీలు ఇలా అందరూ స్థానిక ఎమ్మెల్యే తో సమన్వయం చేసుకుంటూ యాత్రను విజయవంతం చేయాలని ముఖ్య మంత్రి జగన్( CM YS Jagan ) దిశా నిర్దేశం చేశారు.

Telugu Ap, Bhuvaneswari, Ys Jagan-Telugu Political News

గత 52 నెలలుగా వైసిపి ప్రభుత్వం( YCP Government ) వల్ల ప్రజలకు జరిగిన మంచిని వివరించాలని వచ్చే ఎన్నికలు క్యాస్ట్ వార్ కాకుండా క్లాస్ వార్ గా మారాయని పేదలకు పెద్దలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతున్నట్లుగా అభివర్ణించిన జగన్ ఈ యుద్దం లో వైసీపీ వైపు ప్రజలు నిలబడేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత మీదేనంటూ రీజనల్ కోఆర్డినేటర్లకు సూచించినట్టు తెలుస్తుంది .ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు నిరంతరం ప్రజల్లోనే ఉండాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా తెలుస్తుంది.దీనికి తగ్గట్టే ఆయన ఈ యాత్రను ప్లాన్ చేశారట .

Telugu Ap, Bhuvaneswari, Ys Jagan-Telugu Political News

ఇది అతి ముఖ్యమైన యాత్ర అని ఉదాసీనంగా ఉంటే సహించనని కూడా ఆయన జిల్లా కోఆర్డినేట్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.ప్రతిపక్ష తెలుగుదేశం( Telugudesam ) కూడా బస్సు యాత్రలకు ప్లాన్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు అరెస్టుతో కార్యక్రమం వాయిదా పడింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) ఆ యాత్రను పూర్తి చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ దానిపైన లేదు.అయితే చంద్రబాబు బయటికి రావటమే తెలుగుదేశానికి అత్యంత ప్రాధాన్యత అంశం గా మారినట్లుగా తెలుస్తుంది .ఒక్కసారి ఆయన బయటకు వస్తే ఇటువంటి యాత్రలన్నీ ఆయనే పూర్తి చేస్తారని తెలుగుదేశం భావనగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube