వైరల్: 9ఏళ్ల బాలిక ఏకధాటిగా 5 గంటలు స్విమ్మింగ్ చేసి రికార్డ్ నెలకొల్పింది!

అవును, మీరు విన్నది నిజమే.ఓ తొమ్మిదేళ్ల బాలిక నిరాటంకంగా 5 గంటల పాటు ఈత కొట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్( Golden Book of World Records ) స్థానం దక్కించుకుంది.

 9 Year Old Tanushree Made A World Record By Swimming Continuously For 5 Hours,ta-TeluguStop.com

ఈ సందర్బంగా 12 గంటలపాటు ఈదడమే తన తదుపరి లక్ష్యమని చెప్పి శెభాస్ అనిపించుకుంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన తనుశ్రీ కోసరే ఈ ఘనత సాధించింది.

జిల్లాలోని పురఈ అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది.ఈ గ్రామానికి చెందిన ప్లేయర్లు ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దాఖలాలు వున్నాయి.

ఈ క్రమంలో వారంతా దేశానికీ గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆ బాటలోనే తనుశ్రీ కొసరే అనే బాలిక నడిచింది.

Telugu Golden, Set, Tanushree, Latest-Latest News - Telugu

స్విమ్మింగ్( Swimming ) ఆసక్తితో ఫ్లోటింగ్ వింగ్స్ స్విమ్మింగ్ అకాడమీలో చేరి ఆమె శిక్షణ తీసుకుంది.అలా ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు సాధన చేసేది.ఈ నేపధ్యంలో ఆదివారం 5 గంటల పాటు ఏక బిగిన చెరువులో ఈది వరల్డ్ రికార్డ్ సృష్టించింది.గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.

బాలిక స్విమ్మింగ్ చేస్తుండగా గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని తనుశ్రీ( Tanusree )ని ప్రోత్సహించడం విశేషం.చెరువులో నుంచి బయటకు వచ్చిన తనుశ్రీకి కేరింతలలో స్వాగతం పలికారు.

అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Telugu Golden, Set, Tanushree, Latest-Latest News - Telugu

కాగా తనుశ్రీ సాధించిన ఈ విజయంపై ఆసియా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యుడు అలోక్ కుమార్( Alok Kumar ) స్పందించారు.‘దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డు ఇస్తారు.ఇపుడు ఈ 9 ఏళ్ల బాలిక 5 గంటలపాటు ఈది ప్రపంచ రికార్డు సాధించడం సాధారణ విషయం కాదు.

మొత్తం ప్రక్రియ ముగిశాక బాలికకు సర్టిఫికేట్ ఇచ్చాం’ అని వివరించారు.కాగా తమ చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

అతి చిన్న వయసులో సాహసోపేతంగా ఆమె సాధించిన ఘనతను స్థానిక ఎమ్మెల్యే అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube