ఫాన్స్ వల్ల అలాంటి కష్టాలు పడుతున్న జగపతిబాబు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో జగపతి బాబు ( Jagapathi Babu )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

 Actor Jagapathi Babu Tweet His Fans Latest, Actor Jagapathi Babu, Tweet Viral, S-TeluguStop.com

ఇకపోతే జగపతిబాబుకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.అయితే అభిమానుల వల్ల కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి.

ఇప్పుడు జగపతి బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది.

దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జగపతిబాబు దండం పెడుతూ మరి ట్వీట్ చేశాడు.ఇటీవల కాలంలో వాళ్లలో కొందరు హీరో అని ప్రేమ చూపించడం కంటే డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నట్లున్నారు.దీంతో ఈ తరహా పనులకు చెక్ పెట్టాలని బాధతో ఒక ట్వీట్ పెట్టాడు.

కాగా ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.అందరికీ నమస్కారం.33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లా.అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్యకారణంగా భావించాను.

వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నీడగా ఉన్నాను.

అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను.కానీ బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులకు ప్రేమ కంటే అశించడం ఎక్కువైపోయింది.నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు.

మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టుతో నాకు సంబంధం లేదు.వాటి నుంచి విరమించుకుంటున్నాను.

కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అని జగపతిబాబు ట్వీట్ చేశాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube