రోజాకు మద్దతుగా నిలిచిన నటి మీనా... యాక్షన్ తీసుకోవాలంటూ కామెంట్స్!

సినీ నటి మంత్రి రోజా( Roja ) పై టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ( Bandaru Satyanarayana ) చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలిసిందే.రోజా నువ్వు ఏకంగా బ్లూ ఫిలిమ్స్ లో నటించావు అంటూ ఆమె పట్ల ఎంతో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బండారు సత్యనారాయణ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

 Actress Meena Support To Roja And Serious On Tdp Bandaru Satyanarayan , Roja,-TeluguStop.com

ఇలా టిడిపి మాజీ మంత్రి ఒక మహిళా మంత్రి పట్ల ఈ విధమైనటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఎంతోమంది సినీ నటీమణులు రోజాకు మద్దతు తెలుపుతూ బండారు సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలి అంటూ మండిపడుతున్నారు.

Telugu Ap, Khushboo, Meena, Radhika, Roja-Movie

ఇప్పటికే నటి కుష్బూ ( Khushboo ) రాధిక ( Radhika ) వంటి వారు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోజా పట్ల ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.అయితే తాజాగా మరొకటి మీనా( Meena ) సైతం రోజాకు మద్దతు తెలిపారు.తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి.

కోర్టు కూడా ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి అంటే ఆమె డిమాండ్ వ్యక్తం చేశారు.బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తితో ఆయన మాటలు బట్టి చూస్తేనే అర్థమవుతుంది.

Telugu Ap, Khushboo, Meena, Radhika, Roja-Movie

రోజా( Roja ) నాకు మంత్రిగా మాత్రమే కాదు ఆమె తన సహనటిగా ఎప్పటినుంచో నాకు పరిచయం ఉంది.తనతో కలిసి నేను ఎన్నో సినిమాలలో నటించాను.ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు.రోజా ఒక నటిగా, మహిళగా, తల్లిగా, మంత్రిగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి మహిళ అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే భయపడుతుందని అనుకుంటున్నారు.

రోజా వ్యక్తిత్వం దెబ్బతినేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకు ఎవరు ఇచ్చారు.ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారు అనుకుంటున్నారా ఈ విషయంలో రోజా చేసే పోరాటంలో మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుంది అంటూ మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube