ఎన్టీఆర్ తో ఐరన్ మ్యాన్ తరహా మూవీ.. వర్కౌట్ అవుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.( Devara ) ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.

 A Movie Like Iron Man With Jr Ntr , Devara, Ntr, Koratala Shiva, Ntr30 Up-TeluguStop.com

తారక్ ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టినా ఇప్పుడు శరవేగంగా పూర్తి చేస్తూ అప్పుడే సగం ఫినిష్ చేసినట్టు టాక్.నవంబర్ నెలాఖరుకు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ ముగించేస్తున్నారు.

అలాగే జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా అనిరుద్( Anirudh Ravichander ) సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు.అందులో త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ఉన్నారు.

ఇదిలా ఉండగా యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ తాజాగా ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో నాగవంశీ ( Naga Vamsi )మాట్లాడుతూ ఎన్టీయే పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.”తారక్ అన్నలో ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉందని అలాంటి దానితో తనతో ఒక సూపర్ హీరో సినిమా ఐరన్ మ్యాన్ లాంటి సినిమాను చేయాలని ఉందని డెఫినెట్ గా ఆ తరహా గ్రాండ్ చిత్రాన్ని తారక్ అన్నతో తప్పకుండా చేస్తానని నాగవంశీ చెప్పుకొచ్చాడు.ఈయన ఎన్టీఆర్ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube