యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”.బిగ్ మాస్ మసాలాగా తెరకెక్కిన స్కంద మూవీ గురువారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
బోయపాటి యాక్షన్ మూవీలకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో చెప్పాల్సిన పని లేదు.
అయితే ఎప్పుడు బోయపాటి( Boyapati Srinu ) బాలయ్యకు ఇచ్చిన రేంజ్ లో మరో హీరోకు బ్లాక్ బస్టర్స్ అనేవి ఇవ్వడం లేదు.ఈసారి కూడా స్కంద సినిమా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది.అయితే వీకెండ్ కావడంతో 3 రోజుల్లో కలెక్షన్స్ బాగానే రాబట్టి పర్వాలేదు అనిపించుకుంటుంది.
మరి స్కంద 3 డేస్( Skanda Three days Collections ) లో ఎంత రాబట్టిందంటే.
మాస్ ఏరియాల్లో బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకు పోతుంది.మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 3.26 కోట్ల షేర్, 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.ఇక మూడు రోజుల్లో మొత్తంగా దాదాపు 15.37 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక ఈ రోజు ఆదివారం రేపు సెలెవలు కావడంతో మరింత కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది.కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫాస్ట్ గానే ఫినిష్ చేసేట్టు కనిపిస్తుంది.చూడాలి ఏం జరుగుతుందో.ఇక ఇందులో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ( హీరోయిన్ గా నటించగా రామ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందో లేదో చూడాలి.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.