మేధాశక్తితో అబ్బురపరుస్తున్న బుడతడు.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..

రెండేళ్ల వయసులో చాలా మంది చిన్నారులు బుడి బుడి అడుగులు వేస్తూ పడిపోతుంటారు.ఇంకొందరు అప్పుడప్పుడే చిన్న చిన్న మాటలు పలకడం నేర్చుకుంటూ ఉంటారు.

 Budatadu, Who Is Astonishing With Intelligence A Place In The Indian Book Of Rec-TeluguStop.com

వారు పలికే పదాలకు పెద్దలు మురిసిపోతుంటారు.మరోసారి అమ్మ, నాన్న, అత్త, తాత, మామ్మ వంటి పదాలను పలకాలని ఆ వయసు చిన్నారులను అడుతుంటూ ఉంటారు.

వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ముద్దు చేస్తుంటారు.అంత వయసులో ఓ చిన్నారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఆ బాలుడి ప్రతిభ చూసి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అభిజిత్( Abhijith ) అనే 22 నెలల బాలుడు ప్రస్తుతం ఓ రికార్డు బద్దలుగొట్టాడు.శ్రీపురం గ్రామంలో దేవరపాగ చంద్రశేఖర్, రాజేశ్వరి( Devarapaga Chandrasekhar, Rajeshwari ) దంపతులకు ఈ బాలుడు జన్మించాడు.

అతడిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని గమనించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఎంతగానో ప్రోత్సహించారు.ఫలితంగా కొద్ది కాలంలోనే వారి శ్రమ ఫలించింది.బాలుడు అభిజిత్ తెలుగు, ఇంగ్లీష్ పదాలను చకచకా చదవడమే కాకుండా వాహనాలను, శరీర భాగాలను ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు.అంత చిన్న వయసులో బాలుడు చూపుతున్న ప్రతిభకు ఊరిలోని వారంతా ఆశ్చర్యపోతున్నారు.

చివరికి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌ ప్రతినిధులు వారి ఊరికి చేరుకున్నారు.

Telugu Abhijit, Indian, Latest, Nagar Kurnool, Vehicles, Sripuram, Telangana-Lat

వారి సమక్షంలో ఆ బాలుడు తన ప్రతిభను ప్రదర్శించాడు.దీంతో వారు అబ్బురపడి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో( India Book of Records ) బాలుడి పేరును చేర్చారు.ఆ వయసులో మాట్లాడడమే చాలా ఎక్కువ అని, అలాంటిది ఆ బాలుడు ఏకంగా ఇంగ్లీషు, తెలుగు పదాలను టకటకా పలకడం ఆశ్చర్యకరమని అంతా ప్రశంసిస్తున్నారు.

ఇక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆ బాలుడి ప్రతిభను మెచ్చి ప్రశంసా పత్రం, షీల్డును పంపించారు.ఇది చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వారిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube