టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.నటుడు శర్వానంద్ ( Sharwanand ) పెళ్లి చేసుకోగా త్వరలోనే వరుణ్ తేజ్ (Varun Tej) కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా ఒక్కొక్క సెలబ్రెటీ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు అయితే సోషల్ మీడియాలో శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి ( Rakshitha Reddy ) గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.శర్వానంద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో హీరోలకు తమ్ముళ్ల పాత్రలలో నటించి మెప్పించారు.
ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన ఈయన అనంతరం హీరోగా మారిపోయారు.
ఇలా హీరోగా శర్వానంద్ ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.హిట్ ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి శర్వానంద్ ఈ ఏడాది పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఈయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్( Political Background ) ఉన్నటువంటి కుటుంబానికి చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహానికి కేవలం శర్వానంద్ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఇలా ఉదయపూర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న అనంతరం శర్వానంద్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చారు.ఈ రిసెప్షన్ కి ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు( Celebrities ) అందరూ హాజరై సందడి చేశారు.
ఇక శర్వానంద్ వివాహం తర్వాత తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా కెరియర్ పరంగా కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే శర్వానంద్ భార్య రక్షిత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రక్షిత వెల్ సెటిల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఎంతో మంచి చదువులు చదువుకుంది.విదేశాలలో ఉద్యోగం చేసింది అలాగే ఈ ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది ఇలాంటి ఎంతో మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి అమ్మాయి మన ఇంటి కోడలు అయితే బాగుంటుందని ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్( Tollywood Stars ) రక్షిత తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశారట అయితే రక్షిత మాత్రం హీరోల నుంచి ప్రపోజల్స్ వస్తుండడంతో తాను రిజెక్ట్ చేస్తూనే వచ్చారట కానీ శర్వానంద్ ప్రపోజల్ రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె శర్వానంద్ తో పెళ్లికి ఒప్పుకున్నారు.
ఈ విధంగా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను రిజెక్ట్ చేసినటువంటి రక్షిత తిరిగి శర్వానంద్ కు భార్యగా తన జీవితంలోకి వచ్చారు.మరి రక్షిత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్( Gossip Viral ) గా మారింది.అయితే వీరి పెళ్లి సమయంలో రక్షిత శర్వానంద్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా మరొక వార్త వైరల్ గా మారింది.మరి రక్షిత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ విషయంపై రక్షిత లేదా శర్వానంద్ స్పందించాల్సి ఉంటుంది.