నయనతార పిల్లల ఫస్ట్ బర్త్ డే... క్యూట్ ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ దంపతులు!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ( Nayanatara ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గత రెండు దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఈమె ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Nayanatara Shares Her Kids Uyri And Ulag Cute Photos On First Birthday Special,-TeluguStop.com

ఇకపోతే ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) తో ప్రేమలో ఉంటూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు.అయితే చివరికి వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకొని ఒకటయ్యారు.

ఇక వీరి వివాహం తర్వాత ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఈ చిన్నారులకు ఈ దంపతులు ఉయిర్( Uyir ), ఉలగ్ ( Ulag ) అని నామకరణం చేశారు ఇక పిల్లలతో కలిసి నయనతార దంపతులు తరచూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఎప్పుడు కూడా వీరీ ఫేస్ కనపడకుండా దాచి ఉంచినటువంటి ఈ జంట చివరికి తన పిల్లల క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో రివిల్ చేశారు.దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

తమ కొడుకుల మొదటి పుట్టినరోజు ( First Birthday ) సందర్భంగా నయనతార దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ కొడుకుల ఫోటోలు షేర్ చేస్తూ వారికి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు.

ఇద్దరు కొడుకులకు ఒకే విధమైనటువంటి డ్రెస్సులను వేసి చాలా స్టైలిష్ గా తయారు చేశారు.ఇక వీరి ఫోటోలను నయనతార సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేస్తూ ఎప్పటినుంచే తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయాలి అనుకుంటున్నాను.అయితే ఆ సమయం ఇప్పటికి వచ్చింది.

ఇక తన కొడుకులు రూపంలో గుణంలో ఎంతో చక్కనైన వారు అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.తమ పిల్లలంటే మాటల్లో చెప్పలేని ప్రేమ అని మా జీవితాలలో వారి కంటే మించిన సంతోషమే ఏదీ లేదు అంటూ ఈ సందర్భంగా తన కొడుకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నయనతార షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube