నయనతార పిల్లల ఫస్ట్ బర్త్ డే… క్యూట్ ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ దంపతులు!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ( Nayanatara ) ఒకరు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గత రెండు దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఈమె ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) తో ప్రేమలో ఉంటూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు.

అయితే చివరికి వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకొని ఒకటయ్యారు.ఇక వీరి వివాహం తర్వాత ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

"""/" / ఈ చిన్నారులకు ఈ దంపతులు ఉయిర్( Uyir ), ఉలగ్ ( Ulag ) అని నామకరణం చేశారు ఇక పిల్లలతో కలిసి నయనతార దంపతులు తరచూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే ఎప్పుడు కూడా వీరీ ఫేస్ కనపడకుండా దాచి ఉంచినటువంటి ఈ జంట చివరికి తన పిల్లల క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో రివిల్ చేశారు.

దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.తమ కొడుకుల మొదటి పుట్టినరోజు ( First Birthday ) సందర్భంగా నయనతార దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ కొడుకుల ఫోటోలు షేర్ చేస్తూ వారికి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు.

"""/" / ఇద్దరు కొడుకులకు ఒకే విధమైనటువంటి డ్రెస్సులను వేసి చాలా స్టైలిష్ గా తయారు చేశారు.

ఇక వీరి ఫోటోలను నయనతార సోషల్ మీడియా( Social Media ) వేదికగా షేర్ చేస్తూ ఎప్పటినుంచే తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయాలి అనుకుంటున్నాను.

అయితే ఆ సమయం ఇప్పటికి వచ్చింది.ఇక తన కొడుకులు రూపంలో గుణంలో ఎంతో చక్కనైన వారు అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.

తమ పిల్లలంటే మాటల్లో చెప్పలేని ప్రేమ అని మా జీవితాలలో వారి కంటే మించిన సంతోషమే ఏదీ లేదు అంటూ ఈ సందర్భంగా తన కొడుకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నయనతార షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 .

నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!