జనసేన కి అదికారం పై హామీ దక్కిందా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొత్తు ప్రకటన తర్వాత జనసేనలో కొత్త ఉత్సాహం వెల్లి విరుస్తుంది.ఏపీ రాజకీయాల్లో డిసైడింగ్ ఫ్యాక్టరీ అయ్యామని ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమను అనుసరించి ఉంటాయని కూడా జనసైనికులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

 Has The Janasena Got The Guarantee Of Power Details, Janasena, Tdp, Pawan Kalyan-TeluguStop.com

దీనికి ఊతమిచ్చేలా మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశం లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.పొత్తుపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని, పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఎటువంటి ప్రవర్తన ఉండకూడదని జనసైనికులకు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది.

కచ్చితంగా ఏర్పడేది జనసేన – తెలుగుదేశం ప్రభుత్వమేనని అధికారంలో వాటా పొందబోతున్నామని ఆయన ధీమా గానే చెప్పినట్లుగా తెలుస్తుంది.దీనిని బట్టి తెలుగుదేశానికి( TDP ) పవన్ కళ్యాణ్ ప్రకటించిన మద్దతు బేషరతు కాదని, ఆయన హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని పూర్తిస్థాయి లో అధికారంలో వాటా పై సూచనప్రాయంగా తెలుగుదేశం నుంచి వచ్చిన సంకేతాలను బట్టి పవన్ అలా రియాక్ట్ అయ్యారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenatdp, Nagababu, Pawan Kalyan, Tirupati-

అంతే కాకుండా సీట్ల కేటాయింపు లో కూడా జనసేన కు( Janasena ) పెద్ద నెంబర్ ఇస్తారని, ఇంతకుముందు ఉభయ గోదావరి జిల్లాల లోనూ ఉత్తరాంధ్రలో మాత్రమే జనసేనకు అధిక సంఖ్యలో సీట్లు ఇస్తారని ప్రచారం జరిగింది, అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి జనసేన సిద్ధపడుతుందనితెలుస్తుంది .తమ బలం స్పష్టంగా కనబడుతున్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోతే ఉప ప్రాంతీయ పార్టీలా మిగిలిపోతామని భవిష్యత్తులో రాజ్యాధికారం ఒంటరిగా సాదించాలంటే తమ బలాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెంచుకోవలసిన అవసరం ఉన్నందున రాయలసీమలో కూడా పార్టీని విస్తరించాలని

Telugu Ap, Chandrababu, Janasena, Janasenatdp, Nagababu, Pawan Kalyan, Tirupati-

నాగబాబు తిరుపతి లో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారట .దీనిని బట్టి టిడిపి పొత్తు తో కలసి వచ్చే ప్రయోజనాలను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తం గా పార్టీని విస్తరించాలని 2029 ఎన్నికలలో ఒంటరిగా జనసెన అదికారం సాదించాలని కోరుకుంటున్నట్లుగా మెగా బ్రదర్ మాటలని బట్టి అర్థమవుతుంది.మరి ఆయన వ్యాఖ్యలు నిజమనుకుంటే కనుక జనసేనకు కాలం కలిసి వచ్చినట్లే తెలుస్తుంది.

ఏది ఏమైనా అందువచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందుపుచ్చుకొని సరికొత్త ఉత్సాహంతో జనసేన అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube