ఏలూరు జిల్లా దెందులూరు మండలం అలుగూడెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
వివాదం కాస్తా ముదరడంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.అనంతరం బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అదేవిధంగా మరోసారి ఘర్షణలు చెలరేగకుండా గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.అయితే ఈ దాడులకు పాత కక్ష్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు.