ములాఖత్, మిలాఖత్ లతో పుట్టిన పార్టీ వైసీపీ అని టీడీపీ నేత పయ్యావుల అన్నారు.సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఎవరితో ములాఖత్, మిలాఖత్ అవుతున్నారని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని పయ్యావుల తెలిపారు.ఎక్కడైనా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారన్న ఆయన ఇక్కడ మాత్రం అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చెబుతోందని విమర్శించారు.అటు అసెంబ్లీలో ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్టకు చేరిందన్నారు.20 మంది సభ్యులను నియంత్రించడానికి 200 మంది మార్షల్స్ వచ్చారని తెలిపారు.మంత్రి అంబటి రాంబాబు బాలయ్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.బాలకృష్ణ తప్పులేదన్న ఆయన చర్యకు ప్రతిచర్య మాత్రమే అక్కడ జరిగిందని తెలిపారు.ఈ క్రమంలోనే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తన గళం ఆగదని స్పష్టం చేశారు.