చంద్రబాబు అరెస్ట్ కాకినాడ రిలే నిరాహార దీక్ష శిబిరంలో మహిళ మృతి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill Development Scam Case )లో అరెస్టు కావటం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.

 Woman Dies In Kakinada Relay Hunger Strike Camp, Chandrababu, Tdp, Tdp Kakinada-TeluguStop.com

మరోపక్క చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.ఇక ఇదే సమయంలో యువ నేత నారా లోకేష్ సైతం ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు.

ఢిల్లీలో పేరుగాంచిన సుప్రీం న్యాయమూర్తులతో చర్చిస్తూనే మరోపక్క జాతీయస్థాయి నేతల దృష్టికి చంద్రబాబు అరెస్ట్ ని తీసుకెళ్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) అక్రమమని టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వారం రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష( TDP Stage Protest )లలో కాకినాడ శిబిరంలో విషాదం చోటుచేసుకుంది.కాకినాడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి ప్రసంగిస్తూ ఉండగా.

ఒక్కసారిగా కుప్పకూలారు.వెంటనే జిజిహెచ్ కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇదిలా ఉంటే సత్యవతి కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం.చంద్రబాబు అరెస్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నేతలు మరణిస్తూ ఉండటం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపుతూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube