టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.ఈ మేరకు చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ న్యాయస్థానం విచారణ చేయనుంది.
చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పై కోర్టులో విచారణ జరగనుంది.మరోవైపు చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా వాదనలు జరగనున్నాయి.
మూడు కేసులకు సంబంధించి ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు వినిపించనున్నారు.అయితే స్కిల్ డెవపల్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.