తిలక్ వర్మ మరో సురేష్ రైనా అవ్వనున్నాడా..ఇద్దరి మధ్య ఉండే కామన్ పాయింట్స్ ఇవే..!

తెలుగు రాష్ట్రాల నుంచి చాలా సంవత్సరాలుగా ఒక్క ప్లేయర్ కూడా భారత జట్టులో చోటు దక్కలేదు.ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ బోర్డ్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి.

 Will Tilak Varma Become Another Suresh Raina These Are The Common Points Between-TeluguStop.com

ఇటీవలే హైదరాబాద్ కి చెందిన తిలక్ వర్మ ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అవడం తెలుగువాళ్లు గర్వపడదగ్గ విషయం.

తిలక్ వర్మ( Tilak Varma ) కు భారత జట్టులో చోటు దక్కడానికి ముఖ్య కారణం ముంబై ఇండియన్స్ టీం.

ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం కి ఆడడం వల్లే తిలక్ వర్మ టాలెంట్ ఏంటో బయటపడింది.బీసీసీఐ సెలెక్టర్లు మొదట వెస్టిండీస్ టీ20 సిరీస్ కోసం తిలక్ వర్మను సెలెక్ట్ చేయడం జరిగింది.

చేతికి అంది వచ్చిన మొదటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.అందుకే మళ్ళీ ఆసియా కప్( Asia Cup ) కు సెలక్ట్ అయ్యాడు.

ఇక అనుభవం లేని కారణంగా వన్డే వరల్డ్ కప్ కు సెలక్ట్ కాలేదు.

Telugu Cricket Board, Rahul, Suresh Raina, Tilak Varma, Virat Kohli-Sports News

తిలక్ వర్మ బ్యాటింగ్, బౌలింగ్ చూసిన వారంతా అతన్ని సురేష్ రైనా తో పోలుస్తున్నారు.సురేష్ రైనాకు, తిలక్ వర్మ కు మధ్య ఉండే కొన్ని కామన్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

సురేష్ రైనా( Suresh Raina ) 1986 నవంబర్ 27న జన్మించాడు.

తిలక్ వర్మ 2002 నవంబర్ 8న జన్మించాడు.ఇద్దరూ నవంబర్ నెలలోనే పుట్టారు.

వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్, ఇద్దరూ రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తారు.ఇక ఇద్దరూ కూడా ఐపీఎల్ లో ఆడిన రెండో మ్యాచ్ లో వాళ్ళ మొదటి అర్థ సెంచరీ చేశారు.

Telugu Cricket Board, Rahul, Suresh Raina, Tilak Varma, Virat Kohli-Sports News

ఇద్దరూ కూడా తమ మొదటి ఐపీఎల్ సీజన్ లోనే 350 కి పైగా పరుగులు చేశారు.ఇద్దరూ తమ రెండవ ఐపిఎల్ సీజన్ లో 340 కి పైగా పరుగులు చేశారు.ఇద్దరూ తాము ఆడిన మొదటి టి20 మ్యాచ్ లోనే రెండు క్యాచ్లు పట్టుకున్నారు.అంతేకాదు ఇద్దరూ కూడా తమ కెరియర్ మొదట్లో రన్ ఛేజ్ చేసే టైంలో 49 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచారు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే మొదటి ఓవర్ లోనే మొదటి వికెట్ తీసుకున్నారు.ఇక భవిష్యత్తులో మరెన్ని సురేష్ రైనా సాధించిన విజయాలను సమం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube