Facial Look : పైసా ఖర్చు లేకుండా ఫేషియల్ లుక్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.మన ఇంట్లో పెళ్లి అయినా, బంధువుల పెళ్లి అయినా అందరిలోనూ తామే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

 Try This Home Remedy For Facial Look-TeluguStop.com

ఇందులో భాగంగానే బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా సహజంగా కూడా ఫేషియల్ లుక్ ( Facial look )ను పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అంటే సూపర్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక చిన్న టమాటోను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ( Orange Peel Powder )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( lemon juice ) మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Facial Glow, Skin, Remedy, Latest, Skin Care, Skin Care

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.మీ ముఖ్యమైన ఈవెంట్ కు పది రోజుల ముందు నుంచి ఈ సింపుల్ రెమెడీని రెగ్యులర్ గా ఫాలో అయ్యారంటే స్కిన్ లో చాలా మార్పును మీరు గమనిస్తారు.

Telugu Tips, Face Pack, Facial Glow, Skin, Remedy, Latest, Skin Care, Skin Care

ఈ హోమ్ రెమెడీ మీ చర్మాన్ని వైట్ అండ్ బ్రైట్ గా మారుస్తుంది.చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది.

చర్మం రంధ్రాలు క్లోజ్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.ఫైనల్ గా ఫేషియల్ లుక్ ను మీకు అందిస్తుంది.

కాబట్టి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube