వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఉల్లిపాయ.. ఒకే ఒక్క ఉల్లిపాయ 9 కిలోలట!

అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే.ఒకే ఒక్క ఉల్లిపాయ( Onion ) వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి, ఏకంగా గిన్నీస్ రికార్డులను( Guinness Record ) నెలకొల్పిందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. 9 కిలోలు బరువు కలిగిన ఆ ఉల్లిపాయ ఆ రైతు జీవితాన్ని మార్చేస్తుందని అతగాడు ఎపుడూ అనుకొని వుండడు.దేశానికైనా, ప్రపంచానికైనా వెన్నెముక రైతే అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

 Uk Gardener Grows Massive 9 Kg Onion Set Guinness World Record Details, Onion, W-TeluguStop.com

అయితే నేడు రైతన్నల జీవితాలు గడ్డు పరిస్తితులలో నడుస్తున్నాయి.ప్రభుత్వాలు మారుతున్నా వారిని గురించిన పట్టించుకొనే నాధుడు లేడని చెప్పుకోకతప్పదు.

Telugu Kg, Kilos, Big, Britain, Farmers, Gareth Griffin, Guernsey, Guinness, Uk-

మరి అలాంటి రైతన్నలు అప్పుడప్పుడు వారు పండించే పంటల విషయంలో రికార్డులు సాధిస్తే అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? అవును, ఏదో సాధించాలి.ఇంకేదో చేయాలనే ఓ రైతు కృషి ఎట్టకేలకు ఫలించింది.భారీ ఉల్లిగడ్డలను పండించాలనే ఆ రైతు కల నెరవేరడంతో ఆ రైతు ఆనందానికి అంతే లేకుండా పోయింది.తన కృషికి ఫలితంగా పండిన 9 కిలోల ఉల్లిగడ్డను చూసిన ఆ రైతు కలా నిజమా అని ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యాడు.

అవును, ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించి సంచలనం సృష్టించాడు బ్రిటన్ కు చెందిన ఓ రైతు.

Telugu Kg, Kilos, Big, Britain, Farmers, Gareth Griffin, Guernsey, Guinness, Uk-

బ్రిటన్(UK) గ్వెర్న్సే(Guernsey) ప్రాంతానికి చెందిన రైతు పీరు గారెత్ గ్రిఫిన్(Gareth Griffin).ఆయన బేసిగా కూరగాయలు పండిస్తుంటాడు.65 గారెత్ కు ఎప్పుడు కొత్త కొత్త పంటలు పడించాలని ఎల్లపుడూ కృషి చేస్తూ వుంటాడు.అలా భారీ సైజు ఉల్లిపాయను పండించాలనే ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు.12ఏళ్లుగా పట్టువదలని విక్కమార్కుడిలా ప్రయత్నించి ఎట్టకేలకు అతని కృషి ఫలించింది.దాంతో అతను పండించిన ఉల్లిపాయ ప్రపంచంలోనే అతి పెద్దది అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ద్వారా ధృవీకరించబడిందని షో నిర్వాహకులు తెలిపారు.హరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో దీన్ని ఈ సందర్బంగా ప్రదర్శించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube