వాట్సప్ సూపర్ ఫీచర్‌.. ఇకపై దానిని సులభంగా గుర్తించవచ్చు!

తన వినియోగదారుల కోసం వాట్సాప్‌( Whatsapp ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూ వారిని ఖుషి చేస్తూ ఉంటుంది.వినియోగదారుల భద్రత, సౌకర్యమే ధ్యేయంగా వాట్సప్ ముందుకు పోతుండడం మనం గమనించవచ్చు.

 Whatsapp Super Feature Now It Can Be Easily Recognized , Whatsapp, Channels, Upd-TeluguStop.com

ఈ క్రమంలో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వరుసగా అప్‌డేట్లను విడుదల చేస్తోంది.వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ నివేదిక ప్రకారం, తాజాగా వాట్సాప్‌ కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను ( WhatsApp Community Group Chat )సులభంగా గుర్తించే విధంగా కొత్త ఐకాన్‌ సహా నావిగేషన్‌ను మెరుగుపరుస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది.

ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి వస్తుందని కూడా ఈ సందర్బంగా తెలిపింది.

Telugu Channels, Latest, App, Status, Ups Tab, Whatsapp-Latest News - Telugu

అయితే ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో నావిగేషన్‌, కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను సులభంగా నిర్వహించడం సహా ఉపయోగించే అవకాశం బీటా టెస్టర్‌లకు ప్రస్తుతం అందుబాటులో ఉంది.ఈ కొత్త ఐకాన్‌తో గ్రూప్‌ చాట్‌లను సులభంగా గుర్తించవచ్చని వాట్సాప్‌ పీచర్‌ ట్రాకర్‌( Whatsapp Peer Tracker ) చెబుతోంది.

కాగా ఈ ఫీచర్‌ ప్రస్తుతం పరీక్షల దశలో వుందని కూడా చెప్పుకొచ్చింది.అయితే ఈ నేపధ్యంలో వినియోగదారులు అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి చేయకపోవడం గమనార్హం.

Telugu Channels, Latest, App, Status, Ups Tab, Whatsapp-Latest News - Telugu

వాట్సాప్‌ ఇటీవలే వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసే వుంటుంది.ఈ తరహా ఫీచర్‌ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లు కలిగి ఉన్నాయి.అదేవిధంగా వాట్సాప్‌ ఛానల్‌లో జాయిన్‌ అయ్యే వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది.వారి ఫోన్‌ నంబర్ల ఇతరులకు కనిపించకుండా చర్యలు తీసుకుంది.భారత్ సహా 150 దేశాల్లో వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను అందిస్తున్నట్లు సంస్థ చెప్పుకొచ్చింది.ఇప్పటికే ఈ ఫీచర్‌ చాలా మందికి అందుబాటులోకి రాగా.

రానున్న కొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.అలాగే వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను మరింత ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చేందుకు సంస్థ కీలక చర్యలు తీసుకుంటోంది.

భారత క్రికెట్‌ జట్టు, దిల్జిత్‌ దోసాంజ్‌, నేహా కక్కర్, కత్రినా కైఫ్‌ వంటి ప్రముఖులతో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube