బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Shah Rukh Kha ) నటించిన జవాన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం లో రూపొందిన జవాన్ సినిమా కి సూపర్ హిట్ టాక్ రావడం తో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.
షారుఖ్ ఖాన్ గత చిత్రం పఠాన్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన పఠాన్ సినిమా( Pathaan ) కి ఏమాత్రం తక్కువ కాకుండా జవాన్ సినిమా కూడా వసూళ్లు సాధిస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తుంది.
![Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Pathaan, Sharukh Khan-Movie Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Pathaan, Sharukh Khan-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Shah-Rukh-Kha-Jawan-movie-collections-Atlee-Kumar-bollywood-social-medi.jpg)
అయితే అసలు విషయం ఏంటి అంటే పఠాన్ తో పోల్చితే జవాన్ సినిమా( Jawan movie ) బాక్సాఫీస్ సందడి తక్కువగానే ఉంది.కారణం ఏదైనా కూడా హిందీ వర్షన్ తో పాటు ఇతర భాషల వర్షన్ లు అన్నీ కూడా ఆశించిన స్థాయి లో వసూళ్లు సాధించలేక పోయినట్లుగా టాక్ వినిపిస్తుంది.మొత్తానికి జవాన్ సినిమా యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయం లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.గత రెండు రోజులుగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల ను సాధించింది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
![Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Pathaan, Sharukh Khan-Movie Telugu Atlee Kumar, Bollywood, Jawan, Nayanthara, Pathaan, Sharukh Khan-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Shah-Rukh-Kha-Jawan-movie-collections-Atlee-Kumar-bollywood-social-media-Nayanthara.jpg)
అక్కడి మీడియా ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించడం జరుగుతోంది.కనుక బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా తో లాంగ్ రన్ లో కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం కస్టమే అన్నట్లుగా అనధికారికంగా చెబుతున్నారు.కానీ బాలీవుడ్ మీడియా మాత్రం మా హిందీ ఇండస్ట్రీకి మరో వెయ్యి కోట్ల సినిమా పడిందని చంకలు గుద్దుకుంటూ సంబుర పడుతున్నారు.ఈ విషయం లో షారుఖ్ ఖాన్ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఇలాంటి ఫేక్ ప్రచారం అవసరమా అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆహా ఓహో అనుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.