జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.తన స్థాయిని మించి పవన్ మాట్లాడొద్దని సూచించారు.
దేనిలోనైనా పవన్ సక్సెస్ అయ్యారా అని ప్రశ్నించారు.
జనసేన- టీడీపీ పొత్తు హిట్ అయిందనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రోజా అన్నారు.
ప్యాకేజీ విషయంలో మాత్రమే పవన్ హిట్ అయ్యారని తెలిపారు.ఢిల్లీ వెళ్లి పవన్ కల్యాణ్ ఏదో చెప్తారట అని ఎద్దేవా చేశారు.
పవన్ ను మెడపట్టి అమిత్ షా గెంటేస్తారన్న మంత్రి రోజా తాము ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.అయితే 10 చోట్లనైనా జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని రోజా ప్రశ్నించారు.
మీలాగా జగన్క గుంపుగా రారన్న మంత్రి రోజా సింగిల్ గానే వస్తారని చెప్పారు.పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఏదో అవుతుందనుకున్నారన్నారు.చంద్రబాబు ఒత్తిడితో బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.రూ.58 కోట్లకు సాఫ్ట్ వేర్ ఉంటే రూ.3 వేల కోట్లకు పెంచి గోల్ మాల్ చేసింది నిజం కాదా అని నిలదీశారు.ఇదంతా పవన్ కల్యాణ్ కు, బ్రాహ్మణికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు.