'గేమ్ ఛేంజర్' బాటలో నడుస్తున్న కల్కి.. కేసు ఫైల్ చేయనున్నారట.. కారణం అదే!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా దీపికా పదుకొనె( Deepika Padukone ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”కల్కి 2898 AD”.( Kalki 2898 AD ) పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Kalki 2898 Ad Files Case Against Vfx Company Details, Prabhas, Vfx Company, Kalk-TeluguStop.com

ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లేలా చేసాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి.

ఈ లీక్స్ విషయంలో ఇప్పుడు టీమ్ కఠిన చర్యలు తీసుకో బోతుంది అనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’( Game Changer Movie ) నుండి కూడా లీక్స్ కాగా మేకర్స్ ఈ విషయంలో కేసు ఫైల్ చేసి కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.మరి ఇదే బాటలో కల్కి మేకర్స్ కూడా నడవ బోతున్నారని సమాచారం.

కల్కి యూనిట్ తాము వర్క్ ఇచ్చిన విఎఫ్ఎక్స్ కంపెనీపై( VFX Company ) కేసు పెట్టనున్నారని సమాచారం.అనివార్య లీక్స్ కారణంగానే ఈ కంపెనీపై కేసు పెట్టేందుకు సిద్ధం అయ్యారని దీని గురించి రానున్న రోజుల్లో మరింత సమాచారం అందే అవకాశం ఉందని టాక్.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube