వానాకాలంలో లైట్ల దగ్గర కీటకాలను తొలగించే ఈ చిట్కాలు పాటిస్తే సరి!

ముఖ్యంగా ఈ వర్షాకాలం( Rainy Season )లో అనేక రకాల సమస్యలు మనుషులని ఇబ్బంది పెడుతూ వుంటాయి.అందులో ప్రధాన సమస్య ఇంట్లోను, బయట లైట్స్ దగ్గర కీటకాల ఇబ్బంది.

 Tips To Get Rid Of Insects Near Lights,tips, Insects, Lights, Monsoons, Rainy Se-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలోనే అవి ఇబ్బందిపెడతాయి.ఒక్కోసారి వాటిని వదిలించుకోవటం చాలా కష్టం అవుతుంది.

అందుకే వాటిని నివారించే మార్గాలవైపు ఆలోచడం మంచిది.సాయంత్రం లైట్లు వెలిగించే ముందు, ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసివేసి, ఆ తర్వాత మాత్రమే ఇంటి లోపల లైట్లు( Lights ) వేయడం ఉత్తమం.

ఇది ఒక ప్రధానమైన చిట్కా.ఇలా చేయడం వలన చాలావరకు పురుగులను నివారించవచ్చు.

Telugu Air, Soda, Doors, Eucalyptus, Insects, Lemon, Lights, Rainy Season, Tips,

అదేవిధంగా సాయంత్రం తలుపులు, కిటికీలు మూసివేసిన తర్వాత, దీపాలను వెలిగించే ముందు, ఇంట్లో కొంత సమయం పాటు కొవ్వొత్తి వెలిగించితే మంచి ఫలితం వుంటుంది.అలాగే, ఇంట్లో వివిధ ప్రదేశాలలో బంతి పువ్వులు లేదా తులసి ఆకుల గుత్తిని( Tulsi Leaves ) వుంచినా సరిపోతుంది.అదేవిధంగా చిమ్మటలను వదిలించుకోవడానికి, మీరు ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్‌ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు.దీన్ని తయారు చేయడానికి, ఒక గిన్నెలో కొంచెం బేకింగ్ సోడా తీసుకొని అందులో యూకలిప్టస్, సిట్రోనెల్లా ఎసెన్షియల్ ఆయిల్ మరియు నిమ్మరసం ఒక్కొక్కటి పది చుక్కలు కలిపితే సరి.తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం వుంటుంది.

Telugu Air, Soda, Doors, Eucalyptus, Insects, Lemon, Lights, Rainy Season, Tips,

మరీ ముఖ్యంగా లైట్ చుట్టూ ఇలాంటి స్ప్రే( Eucalyptus Spray )ని వాడడం వలన ఎక్కువ ఫలితం వుంటుందని గుర్తు పెట్టుకోండి.వర్షాకాలంలో ఇంటిని శుభ్రం చేయడంతో పాటు కిటికీ తలుపులు, ట్యూబ్ లైట్లు, బల్బులు శుభ్రం చేస్తూ ఉండండి.దీని కోసం, రెండు మగ్గుల నీటిలో ఒక కప్పు వెనిగర్, ఒక నిమ్మరసం కలపండి.

తర్వాత, ఈ మిశ్రమంలో గుడ్డను ముంచి, కిటికీలు మరియు తలుపులతో పాటు బల్బ్ మరియు ట్యూబ్‌లైట్‌ను శుభ్రం చేయండి.అయితే దానికంటే ముందు పవర్ కట్ చేయడం ఉత్తమం.

ఈ రకంగా మీరు చేసినట్టైతే కీటకాలు మీ దరి చేరనే చేరవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube