జనాల అభిప్రాయం ఏంటి ? సర్వేలు చేయిస్తున్న బీఆర్ఎస్ 

మూడోసారి గెలుపు పై కాస్త టెన్షన్ పడుతున్న తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది ?  ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ? నియోజకవర్గంలో అభ్యర్థుల విషయంలో వారు ఏ ఆలోచనతో ఉన్నారు.ఇలా అనేక అంశాలపై సర్వేలకు శ్రీకారం చుట్టింది.

 What Is The Opinion Of The People Brs Conducting Surveys , Kcr, Brs, Brs Le-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, సర్వేల ద్వారా జనాల నాడిని పసిగట్టి దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.ముఖ్యంగా కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో ఈ సర్వేలు పగడ్బందీగా చేయిస్తోంది .ఈ సర్వే నివేదికల ఆధారంగా ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పుచేర్పులు చేపట్టేందుకు కేసిఆర్ వెనకాడబోరు అనే విషయం బయటకు రావడంతో టికెట్ దక్కించుకున్న వారు టెన్షన్ పడుతున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులలో చాలామంది అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా,  ప్రజల్లోనూ వారిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.

వారికి కెసిఆర్( CM kcr ) టికెట్ ప్రకటించారు.

Telugu Brs, Congress, Kcr, Telangana Cm, Telangana-Politics

దీంతో మరోసారి పార్టీ అభ్యర్థుల పైన సర్వే చేయిస్తున్నారు.నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.రెండు జాతీయస్థాయి సర్వే ఏజెన్సీల ద్వారా పల్లెలు,  పట్టణాలలో సర్వే టీమ్ కు వివిధ కోణాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

పార్టీ పరంగాను , వ్యక్తిగతంగాను రెండు కోణాల్లోనూ సర్వే చేస్తూ , ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రత్యేక ఏజెన్సీ తో పాటు , ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దళిత బంధు , గృహలక్ష్మి బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలపై వస్తున్న అనేక విమర్శలను సీరియస్ గా తీసుకుని ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

Telugu Brs, Congress, Kcr, Telangana Cm, Telangana-Politics

 ముఖ్యంగా బీఆర్ఎస్( BRS ) నాయకులు వివిధ పథకాల అమలు నిమిత్తం భారీగా సొమ్ములు డిమాండ్ చేస్తున్నట్టుగా మీడియా , సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న నేపద్యంలో అటువంటి వాటికి చెక్ పెట్టేందుకు కేసిఆర్ కసరత్తు చేస్తున్నారు.ఈ సర్వేల ద్వారా  వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది అంచనా వేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు కెసిఆర్ సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube