భౌతిక, సౌందర్య ప్రయోజనాల కోసం ఆపరేషన్లు చేయించుకోవడం మూర్ఖత్వం అని చెప్పవచ్చు.ఈ ఆపరేషన్లు వికటించి ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు.
ప్రజలు ఇవి చూసైనా మారతారా అంటే అదీ జరగడం లేదు.అయితే జర్మనీకి చెందిన 31 ఏళ్ల మోడల్ థెరిసియా ఫిషర్( Theresia Fischer ) తన బాయ్ ఫ్రెండ్ కోసం ఆపరేషన్ ద్వారా ఎత్తు పెరగాలని నిర్ణయించుకుంది.
ఎత్తుగా ఉన్న అమ్మాయి అంటే తనకు బాగా ఇష్టమని లవర్ చెప్తున్నాడని ఈమె మిగతావేవీ ఆలోచించకుండా సర్జరీ కూడా చేయించుకుంది.ఈ సర్జరీ చేయించుకోవడం ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసిందని తాజాగా ఈ ముద్దుగుమ్మ బాధపడుతూ చెప్పింది.
ఎవరూ కూడా ఇలాంటి సర్జరీలు చేయించుకోకూడదని ఆమె సలహా ఇస్తోంది.

థెరిసియా 24 ఏళ్ల వయస్సులో తన కాళ్లను పొడవుగా చేయడానికి( Leg Lengthening Surgery ) శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది.మాజీ లవర్ థామస్ బెహ్రెండ్( Thomas Behrend ) ఎత్తుగా ఉండాలని కోరుకోవడంతో ఆమె ఇలా చేసింది.శస్త్ర చికిత్సకు కోట్లకు పైగా ఖర్చయింది.
వైద్యులు ఆమె కాళ్లకు అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ రాడ్లు వేసి పొడవుగా మారేలా చేశారు.థెరిసియా ఇప్పుడు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంది, కానీ ఆమె శస్త్రచికిత్సకు చింతిస్తోంది.
థెరిసియా తన కాళ్లను మొత్తంగా 5.5 అంగుళాలు పొడుగ్గా చేయడానికి మరొక సర్జరీ కూడా చేయించుకుంది.రెండు సర్జరీలకు 128,000 పౌండ్లు (దాదాపు రూ.1.33 కోట్లు) ఖర్చు అయింది.థెరిసియా, థామస్ 2015లో కలుసుకున్నారు.2019లో ఒక టీవీ షోలో వివాహం చేసుకున్నారు.ఆమెకు రెండవ శస్త్రచికిత్స జరిగిన ఆరు నెలల తర్వాత వారు విడిపోయారు.
తన మాజీ భర్త తనను బలవంతం చేయకపోతే ఆపరేషన్లు చేయించుకునే దానిని కాదని థెరిసియా ఇప్పుడు చెబుతూ వాపోతోంది.

థెరిసియా ఫిషర్ తన శస్త్రచికిత్స వివరాలను జర్మన్ వార్తాపత్రిక బిల్డ్‌తో పంచుకుంది.థెరిసియా ఇప్పుడు తన ఓల్డ్ ఫ్రెండ్ స్టెఫాన్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించింది.అయితే శృంగార విషయంలో బాగా ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు తన కాళ్లకు మరొక సర్జరీ కూడా ఈ ముద్దుగుమ్మ చేయించుకుంది.
ఇప్పుడు కాస్త హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది.