ఇళ్లపై విపక్షాలవి తప్పుడు ప్రచారాలు..: మంత్రి తలసాని

తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు కడుతున్నామని తెలిపారు.

 Opposition Is Spreading False Propaganda On Houses..: Minister Talasani-TeluguStop.com

ఇందులో ప్రస్తుతం 69 వేల ఇళ్లు పూర్తయ్యాయన్న మంత్రి తలసాని ఇవాళ 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.రానున్న రోజుల్లో విడతల వారీగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

కానీ ప్రతిపక్ష పార్టీలు కావాలనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని మండిపడ్డారు.ఇళ్లు కట్టడం ఎంత కష్టమో విపక్షాలకు తెలియదన్నారు.

అందుకే కొందరు ఇళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.అయితే ఎటువంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube