ఇళ్లపై విపక్షాలవి తప్పుడు ప్రచారాలు..: మంత్రి తలసాని

తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు కడుతున్నామని తెలిపారు.ఇందులో ప్రస్తుతం 69 వేల ఇళ్లు పూర్తయ్యాయన్న మంత్రి తలసాని ఇవాళ 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

రానున్న రోజుల్లో విడతల వారీగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.కానీ ప్రతిపక్ష పార్టీలు కావాలనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని మండిపడ్డారు.

ఇళ్లు కట్టడం ఎంత కష్టమో విపక్షాలకు తెలియదన్నారు.అందుకే కొందరు ఇళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అయితే ఎటువంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?