పవర్ స్టార్ కు ఇష్టమైన సాంగ్ ఇదే.. దీని కోసం రాత్రంతా ఆ పని చేశారట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈయన బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Ee Manase Se Se Song From Tholi Prema, Pawan Kalyan, Keerthi Redd-TeluguStop.com

ఈ రోజు పవన్ కళ్యాణ్ తన 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు విషెష్ అందుకున్నారు.నెట్టింట ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

అలాగే పవన్ నటిస్తున్న సినిమాల నుండి ట్రీట్ కూడా మేకర్స్ భారీ లెవల్లో ప్లాన్ చేసారు.ఇప్పటికే ”హరిహర వీరమల్లు” ( Hari Hara Veera Mallu )నుండి అప్డేట్ వచ్చింది.

ఈ ఉహించని సర్ప్రైజ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.ఇక మిగిలిన సినిమాల నుండి కూడా ఈ రోజు అదిరిపోయే ట్రీట్ రాబోతుంది.

ఇదిలా ఉండగా పవన్ కు ఇష్టమైన పాట ఏంటో మీకు తెలుసా? ఈయనకు ఇష్టమైన పాట ఏంటి అంటే.

Telugu Ee Se Se, Keerthi Reddy, Pawan Kalyan, Pawankalyan-Movie

పవన్ నటించిన సినిమాల్లో తొలిప్రేమ ( Tholi Prema )బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ సినిమా తోనే ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెరిగి మాస్ ఆడియెన్స్ కూడా పవన్ కు దక్కారు.మరి ఇదే సినిమాలోని ఈ మనస్సే సాంగ్ అంటే పవన్ కు చాలా ఇష్టం అని ఈ సినిమా డైరెక్టర్ కరుణాకరన్ ఒకానొక సందర్భంలో తెలిపారు.

ఈ సినిమాలోని ఈ పాట ఎడిటింగ్ సమయంలో జరిగిన విషయాన్నీ కూడా పంచుకున్నారు.

Telugu Ee Se Se, Keerthi Reddy, Pawan Kalyan, Pawankalyan-Movie

1998 జులై 24న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి ( Keerthi Reddy )హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా లోని ”ఈ మనస్సే” సాంగ్ ఎడిట్ చేసేప్పుడే పవన్ ఆ సాంగ్ చూపించమని అడిగారట.అప్పుడు ఎడిట్ జరుగుతుంది కాసేపు వెయిట్ చెయ్యండి అని డైరెక్టర్ చెయ్యగా ఒక అన్నారట.

ఈ ఎడిటింగ్ పూర్తీ అయ్యే సరికి అర్ధరాత్రి 2 అయ్యిందట.ఎడిట్ పూర్తి అయ్యాక బయటకు వచ్చి చూడగా అప్పటికి పవన్ కూర్చుని కనిపించారట.

ఈ సాంగ్ చుసిన తర్వాత కరుణాకరన్ ను బాగా చేసారని మెచ్చుకుని అప్పుడు ఇంటికి వెళ్లారట.అంత ఇష్టం ఈ సాంగ్ అంటే అని డైరెక్టర్ చెప్పిన మాటలు ఈ రోజు పుట్టిన రోజు సంద్రాభంగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube