బ్రిటీష్ ప్రధానిగా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి ఆసియా వాసిగా రికార్డుల్లోకెక్కారు రిషి సునాక్( Rishi Sunak )సంక్షోభ సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.తాజాగా తన కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళకు అవకాశం కల్పించారు రిషి.
గోవా( Goa ) మూలాలున్న క్లెయిర్ కౌటీనో (38)ను యూకే ఇంధన శాఖ మంత్రిగా ప్రధాని నియమించారు.తద్వారా సునాక్ కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.
ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న గ్రాంట్ షాప్స్ రక్షణ మంత్రిగా పదోన్నతిని పొందారు.
యూకేలో జన్మించిన కౌటినో( Claire Coutinho ) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు.రాజకీయాల్లోకి ప్రవేశించి ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.గతంలో బ్రిటన్ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా.
రిషి ఆర్ధిక మంత్రిగా వున్నప్పుడు ఆయనకు సహాయకురాలిగా , ట్రెజరీకి ఛాన్సలర్‌గా కౌటినో పనిచేశారు.తనకు మంత్రిగా అవకాశం దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని రిషి సునాక్‌తో కలిసి ఇంధన భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తానని క్లెయిర్ ట్వీట్ చేశారు.
కాగా.ఇప్పటికే బ్రిటన్ కేబినెట్‌లో గోవా మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మాన్( Suella Braverman ) హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.నార్త్ లండన్‌లోని హారోలో ఏప్రిల్ 3, 1980లో జన్మించారు సుయెల్లా బ్రేవర్‌మాన్ .ఆమె అసలు పేరు స్యూ- ఎల్లెన్ కాసియానా ఫెర్నాండెజ్.తండ్రి క్రిస్టీ, తల్లి ఉమా ఫెర్నాండెజ్.
వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే.వివాహం తర్వాత కెన్యా, మారిషస్‌లలో వున్న ఈ జంట 1960లలో బ్రిటన్‌కు వలస వచ్చారు.ఆమె తల్లి వృత్తి రీత్యా నర్సు.2001 సాధారణ ఎన్నికలలో, 2003 బ్రెంట్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.బ్రేవర్‌మాన్ తల్లిదండ్రులు హిందువులు.కానీ ఈమె మాత్రం త్రిరత్న బౌద్ధ సంఘంలో సభ్యురాలు.లండన్ బౌద్ద కేంద్రానికి ఆమె ప్రతి నెలా హాజరవుతారు.బుద్ధుని సూక్తుల సమాహారమైన ధమ్మపదంపై ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
సుయెల్లా భర్త పేరు రేల్ బ్రేవర్‌మాన్.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.