యూట్యూబ్ నుంచి 64 లక్షల వీడియోలు డిలీట్.. కారణం ఏంటంటే..?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్( Youtube ) అంటే తెలియనివారు ఎవరూ ఉండరు.స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూట్యూబ్ ను చూస్తూ ఉంటారు.

 64 Lakh Videos Deleted From Youtube What Is The Reason, Youtube, Removed Videos,-TeluguStop.com

రోజుకు ఒకసారైనా సరే యూట్యూబ్ ను చూసేవారు ఎంతోమంది ఉంటారు.లైవ్ లు చూడటంతో పాటు తమకు ఇష్టమైన అనేక వీడియోలను చూస్తూ ఉంటారు.

అలాగే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ చాలామంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.యూట్యూబ్ ఛానెల్స్( YouTube channels ) ద్వారా కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు.

అలాగే లక్షల్లో కూడా చాలామంది సంపాదిస్తూ దీనికి ఒక ఉపాధిగా తీసుకుంటున్నారు.

Telugu Community, Removed, Tech, Youtube-Technology Telugu

అయితే తాజాగా యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోను డిలీట్ చేసింది.ఈ విషయాన్ని యూట్యూబ్ స్వయంగా స్పష్టం చేసింది.యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను వీడియోలను డిలీట్ చేసినట్లు వెల్లడించింది.2023 జనవరి నుంచి మార్చి వరకు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను యూట్యూబ్ తొలగించింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా 6.48 మిలియన్ల వీడియోలను తొలగించింది.ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన వీడియోలను కూడా యూట్యూబ్ డిలీట్ చేసింది.

Telugu Community, Removed, Tech, Youtube-Technology Telugu

అమెరికాలో 6,54,968 వీడియోలను తొలగించింది.ఆ తర్వాత రష్యాలో( Russia ) 491933 వీడియోలను తొలగించగా.బ్రెజిల్ లో 449759 వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ ప్రకటించింది.కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పోందే ప్లాగ్ లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై తాజాగా గ్లోబల్ డేటాను విడుదల చేశారు.

ఈ డేటాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వీడియోలను తొలగించారనే దానికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు.అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే, సమాజంలో గొడవలు దారితీసే వీడియోలపై యూట్యూబ్ నిషేధం విధించింది.

దీంతో ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ గుర్తించి డిలీట్ చేస్తూ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube