భారత సంతతి మహిళా గూఢచారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన బ్రిటీష్ రాణి.. ఎవరీ నూర్ ఇనాయత్..?

టిప్పు సుల్తాన్( Tipu Sultan ) కుటుంబానికి చెందిన రాజ వంశీకురాలు, భారత సంతతికి చెందిన బ్రిటీష్ మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్( Noor Inayat Khan ) చిత్ర పటాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా( Queen Camilla ) ఆవిష్కరించారు.రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌లోని ఓ గదికి కూడా ఇనాయత్ పేరు పెట్టారు.

 Queen Camilla Unveils Portrait Of Indian-origin Spy Noor Inayat Khan Details, Qu-TeluguStop.com

ఈ సందర్భంగా ఇనాయత్ జీవిత చరిత్ర పుస్తకాన్ని భారత సంతతికి చెందిన రచయిత్రి శ్రావణి బసు( Shrabani Basu ) క్వీన్ కెమిల్లాకు బహూకరించారు.ఈ కార్యక్రమానికి ఇనాయత్ బంధువు 95 ఏళ్ల షేక్ మహమూద్, మేనల్లుడు పీర్ జియా ఇనాయత్ ఖాన్‌ సహా పలువురు బంధువులు హాజరయ్యారు.పోర్ట్రెయిట్ పెయింటర్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ బ్రిటీష్ కళాకారుడు పాల్ బ్రాసన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.1944లో జర్మనీలోని డాచౌ కాన్సంట్రేషన్ క్యాంపులో గెస్టాపో చేతుల్లో కాల్చి చంపడానికి ముందు నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రాల ఆధారంగా ఈ పోర్ట్రెయిట్ తయారు చేశాడు.

Telugu British Airce, France, Moscow, Paul Brason, Spynoor, Tipu Sultan, Waaf, W

ఎవరీ నూర్ ఇనాయత్ .?

బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్‌( British Airforce ) మహిళా విభాగంలో ఇనాయత్ విశేష సేవలు అందించారు.అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనూ విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించారు.1914లో మాస్కోలో( Moscow ) జన్మించారు నూర్ ఇనాయత్.ఈమె తండ్రి భారతీయ సూఫీ సన్యాసి కాగా.తల్లి అమెరికన్ మహిళ.నూర్ చిన్నతనంలోనే వీరి కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.అనంతరం ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.

రెండో ప్రపంచ యుద్ధంలో( World War 2 ) ఫ్రాన్స్ పరాజయం పాలవ్వడంతో నూర్ ఇంగ్లాండ్‌కు చేరుకుని బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్ మహిళా విభాగంలో చేరారు.నిఘా, గూఢచార్యం నిమిత్తం ఏర్పాటు చేసిన ఎస్‌వోఈ విభాగంలో చేరారు.

అంతేకాదు.అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఫ్రాన్స్‌పై ( France ) నిఘా నిమిత్తం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఇనాయత్ రికార్డు సృష్టించారు.

Telugu British Airce, France, Moscow, Paul Brason, Spynoor, Tipu Sultan, Waaf, W

ప్రమాదకర పరిస్ధితుల్లో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచినందుకు గాను ప్రతిష్టాత్మక జార్జ్ క్రాస్ పురస్కారాన్ని( George Cross Award ) అందుకున్నారు.ఆర్ఏఎఫ్ ఉమెన్స్ యాక్సిలరీ ఎయిర్‌ఫోర్స్ (డబ్ల్యూఏఏఎఫ్)లో జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్న ఇద్దరిలో ఒకరుగా ఇనాయత్ చరిత్రలో నిలిచిపోయారు.

కాగా.1918లో స్థాపించబడిన ఆర్ఏఎఫ్ క్లబ్ అనేది ఒక ప్రైవేట్ సభ్యుల క్లబ్, రిజిస్టర్డ్ ఛారిటీ .ఆర్ఏఎఫ్ అధికారులకు వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది.ఇందులో 24000 మంది రాయల్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారులు, వారి కుటుంబ సభ్యులు సభ్యులుగా వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube