భారత సంతతి మహిళా గూఢచారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన బ్రిటీష్ రాణి.. ఎవరీ నూర్ ఇనాయత్..?
TeluguStop.com
టిప్పు సుల్తాన్( Tipu Sultan ) కుటుంబానికి చెందిన రాజ వంశీకురాలు, భారత సంతతికి చెందిన బ్రిటీష్ మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్( Noor Inayat Khan ) చిత్ర పటాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా( Queen Camilla ) ఆవిష్కరించారు.
రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌లోని ఓ గదికి కూడా ఇనాయత్ పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఇనాయత్ జీవిత చరిత్ర పుస్తకాన్ని భారత సంతతికి చెందిన రచయిత్రి శ్రావణి బసు( Shrabani Basu ) క్వీన్ కెమిల్లాకు బహూకరించారు.
ఈ కార్యక్రమానికి ఇనాయత్ బంధువు 95 ఏళ్ల షేక్ మహమూద్, మేనల్లుడు పీర్ జియా ఇనాయత్ ఖాన్ సహా పలువురు బంధువులు హాజరయ్యారు.
పోర్ట్రెయిట్ పెయింటర్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ బ్రిటీష్ కళాకారుడు పాల్ బ్రాసన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
1944లో జర్మనీలోని డాచౌ కాన్సంట్రేషన్ క్యాంపులో గెస్టాపో చేతుల్లో కాల్చి చంపడానికి ముందు నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రాల ఆధారంగా ఈ పోర్ట్రెయిట్ తయారు చేశాడు.
"""/" /
H3 Class=subheader-styleఎవరీ నూర్ ఇనాయత్ .?/h3p
బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్( British Airforce ) మహిళా విభాగంలో ఇనాయత్ విశేష సేవలు అందించారు.
అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనూ విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించారు.1914లో మాస్కోలో( Moscow ) జన్మించారు నూర్ ఇనాయత్.
ఈమె తండ్రి భారతీయ సూఫీ సన్యాసి కాగా.తల్లి అమెరికన్ మహిళ.
నూర్ చిన్నతనంలోనే వీరి కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.అనంతరం ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో( World War 2 ) ఫ్రాన్స్ పరాజయం పాలవ్వడంతో నూర్ ఇంగ్లాండ్‌కు చేరుకుని బ్రిటీష్ ఎయిర్‌ఫోర్స్ మహిళా విభాగంలో చేరారు.
నిఘా, గూఢచార్యం నిమిత్తం ఏర్పాటు చేసిన ఎస్‌వోఈ విభాగంలో చేరారు.అంతేకాదు.
అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఫ్రాన్స్‌పై ( France ) నిఘా నిమిత్తం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఇనాయత్ రికార్డు సృష్టించారు.
"""/" /
ప్రమాదకర పరిస్ధితుల్లో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచినందుకు గాను ప్రతిష్టాత్మక జార్జ్ క్రాస్ పురస్కారాన్ని( George Cross Award ) అందుకున్నారు.
ఆర్ఏఎఫ్ ఉమెన్స్ యాక్సిలరీ ఎయిర్‌ఫోర్స్ (డబ్ల్యూఏఏఎఫ్)లో జార్జ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్న ఇద్దరిలో ఒకరుగా ఇనాయత్ చరిత్రలో నిలిచిపోయారు.
కాగా.1918లో స్థాపించబడిన ఆర్ఏఎఫ్ క్లబ్ అనేది ఒక ప్రైవేట్ సభ్యుల క్లబ్, రిజిస్టర్డ్ ఛారిటీ .
ఆర్ఏఎఫ్ అధికారులకు వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది.ఇందులో 24000 మంది రాయల్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారులు, వారి కుటుంబ సభ్యులు సభ్యులుగా వున్నారు.
ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?