గుడుంబా శంకర్ రీ రిలీజ్... అద్భుతమైన అనుభవం అంటున్న మీరాజాస్మిన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalya n)సెప్టెంబర్ రెండవ తేదీ పుట్టిన రోజు( Birthday ) జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు ఈయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేడు గుడుంబా శంకర్ సినిమాని తిరిగి విడుదల చేశారు.

 Mirajasmin Says Gudumba Shankar Re Release Wonderful Experience, Meera Jasmine ,-TeluguStop.com

ఇక ఈ సినిమాని విడుదల చేసిన తరువాత వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా జనసేన పార్టీ( Janasena Party )కి విరాళంగా అందించబోతున్నట్లు నిర్మాత నాగబాబు( Nagababu )వెల్లడించారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరాజాస్మిన్( Meera Jasmine )నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా గుడుంబా శంకర్( Gudumba Shankar ) సుమారు 20 సంవత్సరాలు తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో మీరాజాస్మిన్ ఈ సినిమా రి రిలీజ్ పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడుంబా శంకర్ సినిమా అని తిరిగి విడుదల చేయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.ఈ సినిమా నాకెంతో ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారితో నటించడం నిజంగా ఓ అద్భుతమైన అనుభవం అని తెలిపారు.షూటింగ్‌ను మేము చాలా ఎంజాయ్‌ చేశాం.కామెడీ సీన్స్‌, సాంగ్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.

ఈ రిలీజై 20 ఏళ్లు గడిచాయంటే అసలు నమ్మశక్యంగా లేదని ఇలా 20 సంవత్సరాల తర్వాత అంతే ప్రేమను చూపిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు అంటూ మీరా జాస్మిన్ ఈ సందర్భంగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube