తెలుగు సిని ప్రేక్షకులకు కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి( Rishab Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాంతార సినిమాతో( Kantara Movie ) దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి.
చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఒక సినిమాతో స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.ప్రస్తుతం రిషబ్ శెట్టి పార్ట్ కాంతార 2 లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
కాగా ఈ మూవీ కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగె భూతకోలా( Bhootakola ) ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమా ముందు వరకు హీరో రిషబ్ శెట్టి అంటే ఎవరు అన్నది చాలామందికి తెలియదు.కానీ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.గత ఏడాది విడుదలైన కాంతార మూవీ దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రక్షాబంధన్( Raksha Bandhan ) సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు.తన ముద్దుల కూతురు రాధ్య,( Radhya ) కుమారుడు రాన్వీ ( Ranvi ) రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి.
ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీ రక్షాబంధన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.