Rishab Shetty Children: అన్నను దీవిస్తున్న చెల్లి.. ఈ స్టార్ కిడ్స్ ఆప్యాయతను చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
తెలుగు సిని ప్రేక్షకులకు కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి( Rishab Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కాంతార సినిమాతో( Kantara Movie ) దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి.
చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఒక సినిమాతో స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.ప్రస్తుతం రిషబ్ శెట్టి పార్ట్ కాంతార 2 లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
"""/" /
కాగా ఈ మూవీ కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగె భూతకోలా( Bhootakola ) ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఈ సినిమా ముందు వరకు హీరో రిషబ్ శెట్టి అంటే ఎవరు అన్నది చాలామందికి తెలియదు.
కానీ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
గత ఏడాది విడుదలైన కాంతార మూవీ దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రక్షాబంధన్( Raksha Bandhan ) సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు.
తన ముద్దుల కూతురు రాధ్య,( Radhya ) కుమారుడు రాన్వీ ( Ranvi ) రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి.
"""/" /
ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.
చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీ రక్షాబంధన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.