1985లో పదో తరగతి పూర్తి.. పీయూసీ పరీక్షలు రాస్తున్న ఆటోవాలా.. చదువుపై ఇతని ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

చదువుకోవాలని భావించే వాళ్లు వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సులో అయినా చదువుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.ఒక ఆటో డ్రైవర్ 1985 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశారు.

 Auto Driver Bhasker Career Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే చదువుకోవాలనే కోరిక మాత్రం అతనిలో బలంగా ఉండేది.చదువుపై ఉన్న ఆసక్తిగా ఈ ఏడాది ఆ ఆటో డ్రైవర్ పీయూసీ పరీక్షలు( PUC Exams ) రాశారు.

ఆటో డ్రైవర్ భాస్కర్ గురించి నిధి అగర్వాల్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

నిధి అగర్వాల్( Nidhi Agarwal ) తన పోస్ట్ లో ఈరోజు ఓలా క్యాబ్స్ ఆటో ద్వారా నాకు భాస్కర్ అనే వ్యక్తి పరిచయం అయ్యారని ఆమె కామెంట్లు చేశారు.ఆటో డ్రైవర్ భాస్కర్ ఈరోజు పీయూసీ ఇంగ్లీష్ పరీక్ష రాశారని ఆమె చెప్పుకొచ్చారు.1985 సంవత్సరంలో పది పాసైన భాస్కర్ ఇన్నేళ్ల తర్వాత పీయూసీ పరీక్షలు రాసి చదువుపై తన ప్రేమను చాటుకున్నారు.భాస్కర్ కు ఇద్దరు పిల్లలు అని ఒకరు ఆరో తరగతి మరొకరు మూడో తరగతి చదువుతున్నారని ఆమె పేర్కొన్నారు.

భాస్కర్ 38 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ చదువుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.భాస్కర్ ఒకవైపు ఆటో డ్రైవర్ గా పని చేస్తూనే మరోవైపు చదువుకుంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.నిధి అగర్వాల్ భాస్కర్ కు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం గమనార్హం.

భాస్కర్ పీయూసీ పరీక్షలు పాసై కెరీర్ పరంగా సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.భాస్కర్ భవిష్యత్తు ఉన్నత చదువులు చదవాలని తన పిల్లలను కూడా మంచి చదువులు చదివించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.

ఆటో డ్రైవర్ భాస్కర్ చదువు విలువను గుర్తించి ఉన్నత చదువులు చదువుకుంటూ తనలా చదువుకోవాలని భావించే వాళ్లు సైతం చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Auto Driver Bhasker Career Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube