రౌడీ స్టార్ స్టామినా మరోసారి నిరూపితం అయ్యేనా?

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) హీరోగా సమంత ( Samantha )హీరోయిన్‌ గా రూపొందిన ఖుషి సినిమా( Kushi movie ) ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ముఖ్యంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Samantha And Vijay Devarakonda Kushi Movie Pre Release Buzz , Samantha , Vijay-TeluguStop.com

ఖుషి సినిమా లో సమంత హీరోయిన్‌ గా నటించడం వల్ల స్థాయి పెరిగింది అనడంలో సందేహం లేదు.

మజిలి ( Majili )వంటి విభిన్నమైన సినిమా తర్వాత రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ తో శివ నిర్వాన ( Shiva Nirvana )సినిమా రూపొందించిన నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి.పైగా ఈ సినిమా కు మంచి పబ్లిసిటీ చేస్తూ వచ్చారు.చివర్లో కాస్త డల్‌ అయినా కూడా ఓవరాల్‌ గా సినిమాకు భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తారని ఆశించినా కూడా భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయపట్టలేదు.

అయినా కూడా సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.రౌడీ స్టార్ ఇమేజ్ ఏంటి అనేది ఈ సినిమా తో మరోసారి నిరూపితం అవ్వబోతుంది.

సినిమా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకున్నా కూడా మంచి వసూళ్లు నమోదు అవుతే అప్పుడు ఆ హీరో గ్రేట్‌ అన్నట్లుగా ఒక అభిప్రాయం ఉంది.అందుకే ఇప్పుడు కూడా రౌడీ స్టార్‌ ఇమేజ్ కు ఒక పరీక్ష అన్నట్లుగా ఖుషి సినిమా ఉండబోతుంది అంటూ కొందరు నమ్మకంగా ఉన్నారు.ఆకట్టుకునే విధంగా ఖుషి సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతున్న నేపథ్యం లో రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండకు చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ సక్సెస్ పడబోతుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube