ప్రభుత్వ అధికారిపై దాడి.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు శిక్ష

ప్రభుత్వ అధికారిపై( Govt Officer ) దాడి చేసిన నేరంపై భారత సంతతికి చెందిన మహిళకు జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.( Singapore Court ) పబ్లిక్ సర్వెంట్‌‌ను ఉద్దేశపూర్వకంగా గాయపరిచారనే అభియోగంపై కే.

 Indian-origin Woman Jailed For Attacking Public Servant In Singapore Details, In-TeluguStop.com

శాంతి కృష్ణసామిని( K Santhi Krishnasamy ) దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం.తన కుమారుడు నేషనల్ సర్వీస్ కోసం రిపోర్ట్ చేయడంలో విఫలమవ్వడంతో సెంట్రల్ మ్యాన్‌పవర్ బేస్ (సీఎంపీబీ) అనలిస్ట్ ఇన్‌స్పెక్టర్‌పై శాంతి దాడి చేసింది.

ఈ నేరానికి గాను ఆమెకు 18 వారాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.

జిల్లా జడ్జి క్రిస్టోఫర్ గోహ్‌( District Judge Christopher Goh ) శిక్షకు గల కారణాలను తెలియజేస్తుండగా శాంతి పదే పదే అంతరాయం కలిగించింది.పబ్లిక్ సర్వెంట్లపై నేరాలు జరిగినప్పుడు, సాధారణ నిరోధమే ప్రధానమైనదన్న ప్రాసిక్యూషన్‌తో తాను ఏకీభవిస్తున్నానని న్యాయమూర్తి ఏకీభవించారు.

అధికారి శరీరానికి వున్న బాడీ కామ్‌ ఫుటేజ్‌లో శాంతి దురుసు ప్రవర్తన, దాడి స్పష్టంగా కనిపించింది.సంఘటన సమయంలో ప్రభుత్వ అధికారిని ఆమె పలుమార్లు పట్టుకున్నట్లు, లాగినట్లు తేలింది.

Telugu Public Servant, Indian Origin, Jailed, Singapore, Singaporenri-Telugu NRI

అంతేకాదు.నేరం చేసిన పశ్చాత్తాపం కూడా శాంతిలో కనిపించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.తన చర్యలపై ఆమె ఎన్‌లిస్ట్‌‌మెంట్ ఇన్‌స్పెక్టర్‌కు( Enlistment Inspector ) క్షమాపణ చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదని ఫైర్ అయ్యారు.ఇదే సమయంలో శాంతి కనుక శిక్షపై అప్పీల్ చేయాలనుకుంటే పరిగణించాలని సూచిస్తూ, ఆమె శిక్షను వాయిదా వేశారు.

కోర్ట్ రికార్డుల ప్రకారం శాంతి తన శిక్షపై అప్పీల్ చేసింది.

Telugu Public Servant, Indian Origin, Jailed, Singapore, Singaporenri-Telugu NRI

శాంతి కుమారుడు కవింసారంగ్ పిన్( Kavinsarang Shin ) ఏప్రిల్ 23, 2021న ఉదయం పులావు ద్వీపం టెకాంగ్‌లోని ప్రాథమిక సైనిక శిక్షణా కేంద్రంలో నమోదవ్వడంలో విఫలమైనట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోలిన్ ఎన్‌జి తలిపారు.అయితే తన కుమారుడి చేరిక గురించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందలేదని శాంతి చెప్పింది.1967 నాటి సింగపూర్ చట్టం ప్రకారం సింగపూర్ సాయుధ దళాలలో పనిచేయాలనుకునే యువకులకు ఎన్ఎస్ (నేషనల్ సర్వీస్) తప్పనిసరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube