ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కాసేపటిలో ఖమ్మం చేరుకోనున్నారు.
కేసీఆర్ తీరుపై తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు.
అయితే ఈ లిస్టులో తుమ్మల పేరు లేకపోవడంతో భంగపాటుకు గురైన ఆయన కేసీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.పాలేరు నియోజకవర్గ టికెట్ ను తుమ్మలను కాదని పార్టీ అధిష్టానం ఉపేందర్ కు కేటాయించింది.
కాగా తుమ్మలకు స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో వెయ్యి కార్లతో చేపట్టనున్న భారీ ర్యాలీ నాయకన్ గూడెం నుంచి శ్రీసిటీ వరకు కొనసాగనుంది.